హోమ్ /వార్తలు /సినిమా /

విలన్‌గా అనసూయ భరద్వాజ్.. అభిమానులకు షాక్..

విలన్‌గా అనసూయ భరద్వాజ్.. అభిమానులకు షాక్..

అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)

అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)

Jabardasth Anchor Anasuya Bharadwaj : జబర్దస్త్‌లో యాంకర్‌గా చేసినా, రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించినా.. అనసూయ అందులో ఒదిగిపోతుంది.

Jabardasth Anchor Anasuya Bharadwaj : జబర్దస్త్‌లో యాంకర్‌గా చేసినా, రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించినా.. అనసూయ అందులో ఒదిగిపోతుంది. టీవీ స్క్రీన్‌పై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ముఖ్యంగా రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్‌లోనే హైలైట్. ఆ సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో తన నటనాకౌశలాన్ని ప్రదర్శించింది. కాగా, ఈ ఏడాది కూడా పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఓ సినిమాలో విలన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారని సమాచారం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్న ఓ సినిమాలో అనసూయకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అందులోనే అనసూయ ప్రతినాయకురాలిగా నటిస్తోందట. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.

పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ హీరోగా విజయ్‌ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో అనసూయ కీ రోల్ పోషించింది. ఇప్పుడు సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. పవన్‌-క్రిష్‌ తీయబోతున్న సినిమాలోనూ ఈ అమ్మడుకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చేతినిండా సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంటోంది.

First published:

Tags: Anasuya Bharadwaj, Anchor anasuya, Jabardasth, Telugu Cinema News, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు