‘సైమా’ అవార్డ్ ఫంక్షన్ కోసం ఖతార్‌లో ఖతర్నాక్ అవతారంలో అనసూయ..

జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. తాజాగా ఈ భామ సైమా అవార్డ్స్ ఫంక్షన్ కోసం ఖతార్‌లో ఖతర్నాక్ డ్రెస్‌లో హాజరై సందడి చేసింది.

news18-telugu
Updated: August 14, 2019, 7:39 PM IST
‘సైమా’ అవార్డ్ ఫంక్షన్ కోసం ఖతార్‌లో ఖతర్నాక్ అవతారంలో అనసూయ..
‘అనసూయ భరద్వాజ్’
  • Share this:
జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. గతేడాది రామ్ చరణ్, సమంతల ‘రంగస్థలం’లో రంగమ్మతగా తనలోని నటిని ఎలివేట్ చేసింది. ఈ యేడాది కూడా ‘ఎఫ్2’ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కేవలం నటిగానే కాకుండా ఆమె ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కించేంత పాపులర్ అయింది అనసూయ. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ థియేటర్స్‌లో సందడి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని రాబట్టలేదు. అది వేరే విషయం అనుకో. ఎపుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ  తాజగా సైమా అవార్డుల కోసం ఖతార్‌లో లాండ్ అయింది. అంతేకాదు అక్కడ పొట్టి పొట్టి హాట్ దుస్తులతో హాట్‌గా దర్శనమిచ్చి ఆడియన్స్‌ను అవాక్కయ్యేలా చేసింది. షార్ట్స్, దానిపై రెడ్ కలర్ ఇన్నర్ దానిపై చుక్కల షర్ట్.. ఈ డ్రెసింగ్‌లో అనసూయ సెక్సీ లుక్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


అనసూయ సైమా అవార్డ్ ఫంక్షన్‌కు వచ్చినట్టు సైమా అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. అంతేకాదు ఆమె ఖతార్‌లో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. దక్షణాదికి సంబంధించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగష్టు 15  నుంచి ఖతార్‌లోని దోహాలో ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మరోవైపు సైమా అవార్డుల వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. సైమా అవార్డుల ఫంక్షన్‌లో ‘రంగస్థలం’కు 12 నామినేషన్లు దక్కాయి.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>