అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పాలి. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాదు ఆమె ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కించేంతగా ఆమె క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా అనసూయ.. స్మాల్ స్క్రీన్ పై తనదైన శైలిలో రెచ్చిపోయి విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా అనసూయకు అనుకోని కష్టాలు మొదలయ్యయని టాక్. ముఖ్యంగా అనసూయ ప్రస్తుతం ఎంత పాపులర్ అయినా.. ముందుగా ఆమెను చూడగానే గుర్తుకువచ్చేది జబర్దస్త్ షో మాత్రమే. తాజాగా ఈ జబర్ధస్త్ షో ప్రయాణానికి పులిస్టాప్ పడనుందా ? అంటే అవుననే అంటున్నాయి తెలుగు మీడియా వర్గాలు. జబర్దస్త్ షో ప్రారంభమయినపుడు కొన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత ఒదిలేద్దాం అనుకున్నారు. కానీ ఆ షోకు విపరీతమైన టీఆర్పీ రేటింగ్స్, డిమాండ్ చూసి గత ఎనిమిదేళ్లుగా ఈ ప్రోగ్రామ్ అలా నడుస్తూనే ఉంది.
ఈ షో ను మొదటి నుంచి జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు ఇప్పటికే ఈ షో నుండి పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ షో నుంచి మెగా బ్రదర్ తప్పుకున్న షో టీఆర్పీలో ఎలాంటి మార్పులు రాలేదు. తాజాగా నాగబాబు రూట్లోనే జబర్దస్త్ యాంకర్ అనసూయ ఈ షో నుంచి పక్కకు తప్పుకోనుందని అందరు చెప్పుకుంటున్నారు. అనసూయ ఈ షో నుంచి తప్పుకోవడానికి జబర్ధస్త్ షో నిర్వాహకులే ఆమె పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. మొదటి నుంచి ఈ షోకు అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. మధ్యలో ఏదైనా పర్సనల్ కారణాలతో రాకపోయినా.. మళ్లీ ఎంట్రీ ఇచ్చి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం అనసూయ జబర్ధస్త్ షో తో పాటు జీ తెలుగులో ప్రసారమయ్యే లోకల్ గ్యాంగ్స్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఐతే.. జబర్దస్త్ షో నిర్వాహకుల కండిషన్స్ ప్రకారం... ఒక షోలో మెయిన్ లీడ్స్‌గా ఉన్నా వారు ఒకేసారి రెండు షోలలో కనిపించేందుకు వీలు లేదని చెబుతున్నారు. ఈ ఆంక్షల కారణంగా నాగబాబు సహా పలువురు జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇపుడు అదే కండిషన్స్‌ను అనసూయతో ఏదో ఒకటి ఎంచుకోవాలని చెబుతున్నారట. దీంతో అనసూయ ఏం చేయాలో తెలియక డైలామాలో ఉందట. ఇక అనసూయను ఈ షో నుంచి తప్పించాలని షో నిర్వాహకులు ఒక అంచనాకు వచ్చారు. అందులో భాగంగా ఈ మధ్యాకాలంలో ప్రముఖ నటి బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. మాధవిలతని ఆది స్కిట్లో చూపించారని టాక్.
నాగబాబు వెళ్లిపోతే.. జబర్ధస్త్ షోకు టీఆర్పీ రేటింగ్స్ పడిపోతాయని అందరు అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్‌కు పోటీ ఇచ్చే రియాలిటీ షో రాలేదు. మరోవైపు ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ వస్తోన్న అనసూయ తప్పుకుంటే మాత్రం జబర్ధస్త్ షోకు పెద్ద ప్రమాదమే అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి జబర్ధస్త్ షోలో రంగమ్మత్తను పక్కకు తప్పించాలనే నిర్ణయం జరిగిపోయిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood