Anasuya Bharadwaj: గెలిచిన ఈసీ మెంబర్స్ లిస్టులో రాత్రికి రాత్రే మాయమైన అనసూయ పేరు.. షాక్‌లో యాంకర్..

Anasuya Photo : Instagram

Anasuya Bharadwaj: మా ఎన్నికల్లో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున ఈసీ మెంబర్‌గా పోటీ చేసింది ఈమె. గెలిచినట్లు కూడా ప్రకటించారు సభ్యులు. అంతలోనే ఈమె ఓడిపోయింది అంటూ తేల్చేసారు.

  • Share this:
మా ఎన్నికల్లో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున ఈసీ మెంబర్‌గా పోటీ చేసింది ఈమె. గెలిచినట్లు కూడా ప్రకటించారు సభ్యులు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి అనసూయ తొలిసారి పోటీ చేసి గెలుపొందింది అంటూ ఈమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కూడా మొదలైంది. అనసూయ కూడా తను గెలిచానేమో అనుకుని సంబరాలు చేసుకుంది. అయితే రాత్రికి రాత్రే తేడా జరిగింది. గెలిచిన ఈసీ మెంబర్స్ జాబితాలో తన పేరు లేకపోవడాన్ని చూసి షాక్ అయిపోయింది అనసూయ. అదేంటి అంటూ అందర్నీ అడుగుతుంది. మా ఎన్నికల్లో కూడా మతలబులేంటి అంటూ వరసగా ట్వీట్ చేసింది అనసూయ. రాత్రికి రాత్రే ఏం జరిగింది అంటూ ఆరా తీసింది ఈ జబర్దస్త్ యాంకర్.

కేవలం 600 ఓట్లు లెక్కించడానికి రెండో రోజుకు కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది తనకైతే అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేసింది అనసూయ. గెలిచిన ఈమె మళ్లీ ఓడిపోవడం ఏంటో చాలా మందికి అర్థం కావడం లేదు. ఇదే విషయంపై అనసూయ కూడా షాక్ అయిపోయింది.

ఏదో అర్థం కాక అడుగుతున్నా.. దీనికి సమాధానం ఎవరు చెప్తారో అంటూ అనసూయ సెటైర్లు వేసింది. ఏదేమైనా కూడా గెలిచిన అనసూయ మళ్లీ ఓడిపోయిందని చెప్పడం.. లిస్టులో పేరు కూడా లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. అదేంట్రా బాబూ.. గెలిచిన మనిషి ఎలా ఓడిపోతుంది.. 600 మంది ఓట్లకే ఇంత కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారబ్బా అంటూ నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మా ఎన్నికల అధికారి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: