Anasuya Bharadwaj: యాంకర్ అనసూయకు షాక్ ఇచ్చిన అభిమాని.. ఆశ్చర్యంలో జబర్దస్త్ యాంకర్..

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)

Anasuya Bharadwaj: జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. తన ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు వాళ్లతో అప్ డేట్స్ పంచుకుంటూనే ఉంటుంది.

  • Share this:
జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. తన ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు వాళ్లతో అప్ డేట్స్ పంచుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తుంది అనసూయ. అప్పుడప్పుడూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులకు చెప్తుంటుంది.. మరికొన్నిసార్లు తనకు కూడా తెలియని విషయాలను వాళ్ల నుంచి నేర్చుకుంటుంది. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. తాజాగా ఈ స్టార్ యాంకర్‌ను ఓ అభిమాని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అతడు ఇచ్చిన గిఫ్టుకు అమ్మడు తనను తాను మరిచిపోయింది. మనస్పూర్థిగా ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పింది. అదేంటో తెలుసా.. అనసూయ పాత ఫోటో ఒకటి ఆమెకు చూపించాడు ఫ్యాన్. దాదాపు ఆమె కూడా మరిచిపోయిన ఆ ఫోటోను చూసి అనసూయ కూడా ఎమోషనల్ అయిపోయింది. ఈ రేర్ పిక్‌ నీకు ఎక్కడ దొరికింది అంటూ ఆతృతతో అడిగింది అనసూయ. అంతగా ఆమె ఆశ్చర్యానికి లోనైన ఫోటో ఏంటో కాదు.. భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి NCC సమయంలో తీసుకున్న ఫోటో. ఆ ఫోటోను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. ఆ ఫోటో చూసి ఫిదా అయిపోయింది యాంకర్ అనసూయ భరద్వాజ్. ‘ఓ మై గాడ్.. ఈ ఫొటో నీకెక్కడ దొరికింది.. మా ఇద్దరి లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది’ అంటూ తమ ప్రేమకు బీజం పడిన సందర్భం అదేనంటూ చెప్పుకొచ్చింది అనసూయ భరద్వాజ్.
anasuya bharadwaj,anasuya bharadwaj old photos,anasuya bharadwaj bikini,anasuya bharadwaj bikini photos,anasuya bharadwaj wearing bikini,anasuya bharadwaj hot bikini,anchor anasuya bharadwaj,anchor anasuya bharadwaj hot photos,anchor anasuya bharadwaj hot,anchor anasuya bharadwaj photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj yatra,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ బికినీ,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ ఓల్డ్ ఫోటోలు
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)

NCC సమయంలోనే అనసూయతో భరద్వాజ్ ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూ అక్కడ్నుంచే తమ ప్రేమకథను మొదలు పెట్టారు. ముందు అనసూయ ఇంట్లో ఒప్పుకోలేదు. ఒకటి రెండు కాదు 9 సంవత్సరాల పాటు ఇద్దరూ తమ ప్రేమను గెలిపించుకోడానికి యుద్ధం చేసారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో సుశాంక్, అనసూయ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు అబ్బాయిలున్నారు. కెరీర్‌లో ఇంత బిజీగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు కుటుంబానికి కూడా తగిన టైమ్ కేటాయిస్తూ ఉంటుంది జబర్దస్త్ యాంకర్.
Published by:Praveen Kumar Vadla
First published: