తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ సుమ కనకాల అయ్యుండొచ్చు కానీ వెండితెరతో పాటు బుల్లితెరను కూడా ఏలేస్తున్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే మరో అనుమానం లేకుండా అనసూయ భరద్వాజ్ పేరు చెప్పాల్సిందే. అటూ ఇటూ రప్ఫాడిస్తుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి, పిల్లలు కెరీర్‌కు అడ్డు కాదని మళ్లీ మళ్లీ నిరూపిస్తుంది అనసూయ. మరోవైపు దర్శక నిర్మాతలు కూడా అనసూయకు వరస అవకాశాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఛాన్సులు వస్తున్నాయి కదా అని ఏది పడితే దానికి ఓకే చెప్పకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. అందుకే చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా అనసూయ కెరీర్లో రంగస్థలం, క్షణం లాంటి సినిమాలు అలా నిలిచిపోయాయి. చేసే పాత్ర ఏదైనా సరే అందులో ఒదిగిపోతుంది ఈ రంగమ్మత్త. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమెకు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఓసారి పవన్‌తో నటించే అవకాశం వచ్చినా కూడా కాదనుకుంది. మళ్లీ చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోసారి పవన్‌తో నటించే అవకాశం అనుకు వచ్చినట్లు తెలుస్తుంది. మెగా కుటుంబంతో అనసూయకు మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే ఆ కుటుంబంలో రామ్ చరణ్‌తో రంగస్థలం.. వరుణ్ తేజ్‌తో ఎఫ్ 2.. సాయి ధరమ్ తేజ్‌తో విన్నర్ సినిమాల్లో నటించింది.

రంగమ్మత్తగా అనసూయ (File Photo)
చిరంజీవితో నటించే అవకాశం కోసం వేచి చూస్తుంది. అల్లు అర్జున్‌తో కూడా పుష్పతో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. మరోవైపు ఇప్పుడు పవన్ సినిమాలో నటించబోతుందని వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్, అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్, క్రిష్ సినిమా, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల్లో క్రిష్‌తో ఇప్పటికే సినిమా మొదలు పెట్టాడు పవన్. ఈ సినిమాలో అనసూయకు ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్, అనసూయ (File/Photo)
ఇందులో ఓ పాటలో అనసూయ చిందేయబోతుంది. కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఏఎం రత్నం దాదాపు 100 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నిజానికి 8 ఏళ్ల కిందే అనసూయ, పవన్ అత్తారింటికి దారేదిలో ఐటం సాంగ్‌లో చేయాల్సి ఉంది. కానీ అప్పుడు తాను గుంపులో గోవిందాలా ఉండలేనని.. దాంతో పాటు గర్భంతో కూడా ఉండటంతో కాదనుకుంది అనసూయ. అప్పుడు పవన్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేసారని.. వాళ్లను చంపేయాలనేంత కసి వచ్చిందని చెప్పింది అనసూయ. ఏదేమైనా అప్పుడు మిస్ అయిన అవకాశం మళ్లీ ఇప్పుడొచ్చింది. మరి ఈ సారైనా పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుందా లేదా చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:January 18, 2021, 20:09 IST