హీరోతో ఆ రాత్రంతా మీరు.. నెటిజన్‌పై అనసూయ ఫైర్..

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ తాజాగా అభిమానులతో లైవ్ ఛాట్ చేసింది అనసూయ. అందులో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా వచ్చాయి ఈమెకు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2020, 12:35 PM IST
హీరోతో ఆ రాత్రంతా మీరు.. నెటిజన్‌పై అనసూయ ఫైర్..
అనసూయ (Anasuya Bharadwaj)
  • Share this:
లాక్‌డౌన్ కారణంగా ఇల్లు కదలడానికి లేదు. అందుకే హాయిగా మన సెలబ్రిటీస్ అంతా ఇంట్లోనే ఉండి అభిమానులతో మాట్లాడుకుంటున్నారు. వాళ్లతో తమ విషయాల గురించి చెప్పుకుంటున్నారు. జరుగుతున్న వాటి గురించి చర్చిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా ఇదే చేసింది. తాజాగా అభిమానులతో లైవ్ ఛాట్ చేసింది అనసూయ. అందులో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా వచ్చాయి ఈమెకు. వాటన్నింటికీ అంతే ఆసక్తికరంగా సమాధానం కూడా చెప్పింది ఈమె. అయితే ఓ నెటిజన్ మాత్రం ఈమెను కాస్త బోల్డ్ క్వశ్చన్ అడిగాడు.

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)


దానికి ఆమె కూడా అంతే బోల్డు‌గా ఫైర్ అయింది. ఛాట్ సందర్భంగా ఓ యువకుడు అప్పట్లో మీకు మాత్రమే చెప్తా సమయంలో మీరు తరుణ్ భాస్కర్‌తో పార్టీలో రాత్రంతా మద్యం తాగి రచ్చ చేశారట కదా అని అడిగాడు.. ఈయన అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా అనసూయ కూడా షాక్ అయింది. అప్పట్లో ఓ టాప్ యాంకర్ పబ్‌లో పార్టీ చేసుకుంటూ పడిపోయింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అది అనసూయ అంటూ కొన్ని గాసిప్స్ కూడా వచ్చాయి.

మీకు మాత్రమే చెప్తా టీంతో అనసూయ
మీకు మాత్రమే చెప్తా టీంతో అనసూయ


అది మైండ్‌లో పెట్టుకుని ఈ నెటిజన్ ప్రశ్న అడిగాడు. దాంతో కోపం నషాలానికి అంటిన అనసూయ.. అతడిపై మండపడింది. చేసారట.. చూసారట అంటూ ఈ అట..లు మీరు మాట్లాడుకోడానికి.. చర్చించుకోడానికి బాగుంటాయ్.. నువ్ ఇంకా పరిణితి చెందాలని సమాధానమిచ్చింది. దాంతో అక్కడితో ఆ టాపిక్ ముగిసింది. ఇదే చాట్‌లో మరిన్ని ప్రశ్నలకు కూడా దాచుకోకుండా సమాధానం చెప్పింది ఈమె.
First published: April 11, 2020, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading