Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 13, 2021, 5:31 PM IST
అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)
నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరగబోతుంది. తెలుగు ఇండస్ట్రీలో కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇప్పుడిప్పుడే ఈమె మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. సుకుమార్ లాంటి అగ్ర దర్శకులు అనసూయను నమ్మి మంచి పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. ఎప్పుడూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా థ్యాంక్ యూ బ్రదర్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా కమిట్ అయింది. ఈ మధ్యే చేసిన లైవ్ ఛాట్‌లో ఓ అభిమాని ఇప్పటి వరకు తెలుగులో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన పాత్ర ఏంటి అని అడిగాడు.. దీనికి చాలా మంది రంగమ్మత్త సమాధానంగా వస్తుందని అనుకున్నారు.. కానీ చిత్రంగా ఇప్పటి వరకు తనకు తెలుగులో ఛాలెంజింగ్ రోల్ ఇచ్చిన వాళ్లే లేరంటూ సమాధానమిచ్చింది. దీనిపై కొందరు అనసూయపై సెటైర్లు కూడా వేస్తున్నారు. రంగమ్మత్త పాత్ర మీకు ఛాలెంజింగ్‌గా అనిపించలేదా.. అంత ఈజీగా చేసారా అంటూ సుకుమార్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

రామ్ చరణ్ అనసూయ భరద్వాజ్ (ram charan anasuya bharadwaj)
మిమ్మల్ని నమ్మి అంత మంచి పాత్ర ఇస్తే దాన్ని కూడా మీరు ఛాలెంజింగ్ అనుకోలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ భామను. రంగమ్మత్త పాత్ర తనకు పేరు తీసుకొచ్చినా కూడా.. తను అనుకున్నంత ఛాలెంజింగ్ కాదని ఫీల్ అవుతుంది అనసూయ. అలాంటి పాత్రల కోసమే వేచి చూస్తున్నట్లు చెప్పింది. అందుకే ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా అవకాశాల కోసం చూస్తున్నానని.. మంచి కథలు వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది అనసూయ. అన్నట్లుగానే ఇప్పుడు అనసూయకు మలయాళం నుంచి అదిరిపోయే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ మెగాస్టార్ మమ్మట్టి సినిమాలో అనసూయను కీలక పాత్ర కోసం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి.

మమ్ముట్టి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)
కథ నచ్చడం.. మలుపు తిప్పే పాత్ర కావడంతో అనసూయ కూడా ఓకే అనేసిందని తెలుస్తుంది. అంతేకాదు.. గతంలో యాత్ర సినిమాలో కలిసి నటించారు మమ్ముట్టి, అనసూయ. కనిపించింది ఒక్క సీన్ అయినా కూడా సుచరిత పాత్ర అనసూయకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పరిచయంతోనే ఇప్పుడు మమ్ముట్టితో నటించడానికి ఒప్పుకుంది అనసూయ. తెలుగులో ఇప్పటి వరకు సత్తా చూపించిన అను.. ఇప్పుడు తన స్టామినా పక్క ఇండస్ట్రీలకు కూడా పాకేలా చేస్తుంది. మరి కేరళకు వెళ్లి తన జబర్దస్త్ యాంకర్ ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.
Published by:
Praveen Kumar Vadla
First published:
January 13, 2021, 5:31 PM IST