Anasuya Bharadwaj: ‘చావు కబురు చల్లగా’ అనసూయ భరద్వాజ్ ఐటం సాంగ్ స్టిల్స్ విడుదల..

అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)

Anasuya Bharadwaj: ఇటు సినిమాలు.. అటు ఈవెంట్స్ అన్నీ పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్. అటూ ఇటూ రెంటినీ మెయింటేన్ చేస్తుంది. ఎక్కడా ఏ చిన్న క్లాష్ కూడా రాకుండా జాగ్రత్త పడుతుంది.

  • Share this:
ఇటు సినిమాలు.. అటు ఈవెంట్స్ అన్నీ పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్. అటూ ఇటూ రెంటినీ మెయింటేన్ చేస్తుంది. ఎక్కడా ఏ చిన్న క్లాష్ కూడా రాకుండా జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈమె ఓ సినిమాలో ఐటం సాంగ్ చేస్తుంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ చేస్తున్న ఐటం సాంగ్‌కు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. ఈ పాట షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా స్టిల్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. అలానే ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్‌లో చిందేసింది.
anasuya bharadwaj,anasuya bharadwaj item song,anasuya bharadwaj item song in chavu kaburu challaga,anasuya bharadwaj bikini,anasuya bharadwaj bikini photos,anasuya bharadwaj wearing bikini,anasuya bharadwaj hot bikini,anchor anasuya bharadwaj,anchor anasuya bharadwaj hot photos,anchor anasuya bharadwaj hot,anchor anasuya bharadwaj photos,anchor anasuya bharadwaj age,anchor anasuya bharadwaj husband,anchor anasuya bharadwaj twitter,anchor anasuya bharadwaj instagram,jabardasth comedy show,anchor anasuya bharadwaj jabardasth comedy show,anchor anasuya bharadwaj movies,anchor anasuya bharadwaj yatra,anchor anasuya bharadwaj rangasthalam,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ సినిమాలు,అనసూయ భరద్వాజ్ జబర్దస్త్,అనసూయ భరద్వాజ్ యాంకర్,అనసూయ భరద్వాజ్ బికినీ,అనసూయ భరద్వాజ్ రంగస్థలం,అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా,అనసూయ చావు కబురు చల్లగా ఐటం సాంగ్
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)

అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే ఈ పాట‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ విడుద‌ల చేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: