ఆకలితో ఉన్న వాళ్ల కడుపు నింపుతున్న అనసూయ..

Anasuya Bharadwaj: కష్టాల్లో ఉన్నపుడే మనుషులకు మానవత్వం అనేది బయటికి వస్తుంది. ఇలాంటి సమయంలో కూడా ఆదుకోకపోతే ఇంకెప్పుడు మనుషులు అనిపించుకంటారు చెప్పండి..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2020, 7:18 PM IST
ఆకలితో ఉన్న వాళ్ల కడుపు నింపుతున్న అనసూయ..
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)
  • Share this:
కష్టాల్లో ఉన్నపుడే మనుషులకు మానవత్వం అనేది బయటికి వస్తుంది. ఇలాంటి సమయంలో కూడా ఆదుకోకపోతే ఇంకెప్పుడు మనుషులు అనిపించుకంటారు చెప్పండి..? అందుకే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. దేవుడు తమకు ఇచ్చిన దాంట్లోనే అందరికీ పంచి పెడుతున్నారు. కొందరు డబ్బులు దానంగా ఇస్తుంటే.. మరికొందరు మాత్రం ఆకలి తీర్చే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇదే చేసింది. తన భర్త భరద్వాజ్‌తో కలిసి వలస కూలీల కడుపు నింపింది. అనాథ శరణాలయానికి వచ్చి వందల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తుంది అనసూయ.

అందులో భాగంగానే పులిహోరతో పాటు కిచిడి కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ ఆకలితో ఉన్న వాళ్లకు ప్యాకెట్స్ రూపంలో అందరికీ పంచి పెడుతుంది ఈ బ్యూటీ. ఎన్ని రోజులు లాక్ డౌన్ ఉంటుందో తెలియదు.. అన్ని రోజుల వరకు తమకు తోచిన విధంగా ఇలా సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది జబర్దస్త్ యాంకర్. మీరు కూడా మీ చుట్టు పక్కల ఆకలితో ఉన్న వాళ్ల కడుపు నింపండి అంటూ కోరింది అనసూయ భరద్వాజ్. కచ్చితంగా త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. అప్పటి వరకు పేదవాళ్ల ఆకలి తీర్చాల్సిన బాధ్యత మనదే అంటుంది అను.

First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading