Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్‌ను ఏడిపించిన కొడుకు.. కారణం ఇదే..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ స్క్రీన్‌పై ఎప్పుడు కనిపించినా కూడా నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వుకే అంతా పడిపోతుంటారు. ఇప్పటికీ అదే నవ్వుతో చాలా మందిని మాయ చేస్తుంటుంది కూడా. అయితే పైకి ఎంత నవ్వుతూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 19, 2020, 3:52 PM IST
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్‌ను ఏడిపించిన కొడుకు.. కారణం ఇదే..
అనసూయ భరద్వాజ్ (Instagram/anasuya bharadwaj)
  • Share this:
అనసూయ భరద్వాజ్ స్క్రీన్‌పై ఎప్పుడు కనిపించినా కూడా నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వుకే అంతా పడిపోతుంటారు. ఇప్పటికీ అదే నవ్వుతో చాలా మందిని మాయ చేస్తుంటుంది కూడా. అయితే పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తుందో.. లోపల అంత ఎమోషనల్ అనసూయ. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అనసూయ కళ్లలో నీళ్ళు తిరిగాయి. కొడుకు కారణంగానే ఈమె కన్నీరు పెట్టుకుంది. ఇదే విషయం ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేసింది అనసూయ. అసలు ఎందుకు ఏడ్చింది అంటే దాని వెనక పెద్ద కథ ఉంది. 9 ఏళ్ల తన కొడుకు చెప్పిన కొన్ని మాటలు విన్న తర్వాత కన్నీరు నాకు ఆగలేదని చెప్పుకొచ్చింది అనసూయ. అసలు ఈ కుర్రాడు అంతగా ఏం అడిగాడబ్బా అనుకోవచ్చు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితులపైనే అనసూయ కొడుకు ఎమోషనల్ అయ్యాడు. అదే తన అమ్మను కూడా అడిగాడు.

అనసూయ (Anasuya Bharadwaj)
అనసూయ (Anasuya Bharadwaj)


అమ్మా.. నేను రెండు మూడేళ్లు వెనక్కి వెళ్లాలనుకుంటున్నాను.. 2017, 18 అయితే బాగుంది.. ఎందుకంటే అప్పుడు కరోనా లేదు.. వరదల్లేవు.. అవన్నీ నాకు ఎంతో సంతోషాన్ని అందించిన రోజులు అని తన తొమ్మిదేళ్ల కొడుకు చెప్పాడని తెలిపింది అసూయ. తన మాటలు విన్న తర్వాత ఎంతో బాధ అనిపించిందని.. కన్నీరు కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది అనసూయ. నిజమే కదా రెండు మూడేళ్ళ కింద అంతా హాయిగా ఉన్నారు. కానీ 2020లో మాత్రం కరోనాతో పాటు వరదలు ముంచెత్తాయి. అన్నీ బాధలు తప్ప ఇంకేం లేవు. ఎంత త్వరగా 2020 వెళ్లిపోతే అంత మంచిది అంటూ అంతా వేచి చూస్తున్నారు.


అసలు మనకు ఇలాంటి పరిస్థితులు ఎలా వచ్చాయి.. రాబోయే తరాల వారికి మనం ఏం అందిస్తున్నాం.. అంటూ ప్రశ్నించింది అనసూయ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసి చలించిపోయిన అనసూయ కొడుకు అదే విషయం అమ్మను కూడా అడిగేసాడు. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియని పసితనం నుంచి వచ్చిన ప్రశ్నను చూసి అను కూడా కన్నీరు పెట్టుకుంది. అనసూయ, భరద్వాజ్ దంపతులకు అయాన్ష్‌, శౌర్య అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. ఎప్పటికప్పుడు తన కుటుంబం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది అనసూయ. ఓ వైపు కెరీర్‌తో పాటు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తుంది అనసూయ భరద్వాజ్.
Published by: Praveen Kumar Vadla
First published: October 19, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading