హైపర్ ఆదిని ‘బావా’ అని ప్రేమగా పిలిచిన అనసూయ..

అనసూయ, హైపర్ ఆది

Jabardasth Comedy Show : జబర్దస్త్‌లో కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ జంట.. అనసూయ-హైపర్ ఆది. రష్మీ, సుధీర్ తర్వాత ఈ కామెడీ షోలో రొమాన్స్ పండించాలని ట్రై చేస్తోందీ జంట.

  • Share this:
    జబర్దస్త్‌లో కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ జంట.. అనసూయ-హైపర్ ఆది. రష్మీ, సుధీర్ తర్వాత ఈ కామెడీ షోలో రొమాన్స్ పండించాలని ట్రై చేస్తోందీ జంట. ప్రోమోల్లో, స్కిట్లలో వీళ్ల రొమాన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు కూడా. దాని వల్ల రేటింగ్ పెంచుకోవచ్చని చూస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి ఎపిసోడ్‌లో చిన్న పాటి సన్నివేశాన్ని ఆది, అనసూయ కోసం కేటాయిస్తున్నారు. దానిలో భాగంగానే వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. స్కిట్‌లో భాగంగా హైపర్ ఆదిని అనసూయ బావా అని పిలుస్తుంది. ఈ మాటకు ప్రేక్షకులు అవాక్కయ్యారు. రొమాన్స్ డోస్ ఇంకాస్త పెంచేశారుగా అన్నట్లు ఆశ్చర్యపోయారు. అయితే, ఇదంతా చూసిన ప్రేక్షకులు.. ఆది, అనసూయ వ్యవహారంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మీరే తెరపై రొమాన్స్ చేసి, మీరే హైప్ క్రియేట్ చేసి.. రేటింగ్ పెంచుకునే ఎత్తుగడలు వేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

    కాగా, గతంలోనూ పలు సందర్భాల్లో వీళ్లు రొమాన్స్ పండించారు. ఓ సందర్భంలో తమ అఫైర్‌పై వార్తలు రావడంతో వాటిపై సెటైర్ కూడా వేశాడు హైపర్ ఆది. ఆ స్కిట్‌లో అనసూయను రిక్షాపై తీసుకొచ్చిన సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో భాగంగా అనసూయ చేయి పట్టుకోబోయాడు. వెంటనే.. దీని గురించి కూడా వార్తలు రాస్తారని వ్యాఖ్యలు చేశాడు. ‘అనసూయ చేయి పట్టుకున్న హైపర్ ఆది.. భయం పట్టుకున్న భరద్వాజ్..’ అని కూడా హెడ్డింగ్ పెట్టుకోండంటూ సెటైర్ వేశాడు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: