Home /News /movies /

JABARDASTH ANCHOR ANASUYA BHARADWAJ ASSETS AND HER EARNINGS IN TELEVISION PK

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ అన్ని కోట్లు సంపాదిస్తుందా..?

అనసూయ (Anasuya Bharadwaj/Youtube)

అనసూయ (Anasuya Bharadwaj/Youtube)

Anasuya Bharadwaj: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్స్‌లో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా ఈమె ఇప్పటికీ హాట్ షోతో మతులు చెడగొడుతుంది.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్స్‌లో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా ఈమె ఇప్పటికీ హాట్ షోతో మతులు చెడగొడుతుంది. ఈమె అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈమె ఈ స్థాయిలో అందాన్ని కాపాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. పెళ్లి తర్వాతే కెరీర్ క్లోజ్ అంటారు.. కానీ అనసూయ మాత్రం పెళ్లి తర్వాతే అసలు ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తూ హీరోయిన్లకు తాను కూడా ఏం తక్కువ కాదని నిరూపిస్తుంది.

అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)
అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)


ఈమె ఇప్పుడు సంపాదిస్తున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అనసూయ కూడా రెండు చేతులా సంపాదిస్తుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ సంపాదన పరంగా చూసుకుంటే సుమ అందనంత ఎత్తులో ఉంది. ఆమె తర్వాత అనసూయ ఉందని తెలుస్తుంది. ఇతర యాంకర్స్ అసూయ పడేలా స్థాయిలో అనసూయ సంపాదన ఉందని లెక్కలు చెబుతున్నాయి.

అనసూయ భరద్వాజ్ న్యూ లుక్ (anasuya bharadwaj new look)
అనసూయ భరద్వాజ్ న్యూ లుక్ (anasuya bharadwaj new look)


ముఖ్యంగా ఈమె ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోతో చాలా ఇమేజ్ సంపాదించుకుంది. ఈ షోతో వచ్చిన పాపులారిటీతోనే సినిమాలు కూడా చేస్తుంది అనసూయ. అయితే క్రేజ్ ఉంది కదా ఏది పడితే ఆ సినిమా చేసి ఉన్న ఇమేజ్ చెడగొట్టుకోవడం లేదు అను. కథ నచ్చితే కానీ అందులోకి కాలు మోపడం లేదు ఈ రంగమ్మత్త. ఈటీవీ జబర్దస్త్‌తో పాటు మా టీవీలో ఓ షో.. జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్.. ఇప్పుడు జెమినీలో తల్లా పెళ్లామా అనే షో కూడా చేస్తుంది. వీటితో పాటు సినిమాలు కూడా ఉన్నాయి.

అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)
అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)


ప్రస్తుతం ఈమె ఆస్తి కోట్లలోనే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే ఐటి రైడ్స్ కూడా జరిగాయని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై లేదనే సమాధామనే చెప్పింది అనసూయ. ఇదిలా ఉంటే ఈమె పారితోషికంపై జబర్దస్త్‌ కమెడియన్లు కూడా అప్పుడప్పుడూ సెటైర్లు వేస్తుంటారు. ముఖ్యంగా కోటికి పైగా విలువ చేసే ఆడి కార్ అను దగ్గర ఉంది. దాంతో పాటే జూబ్లీహిల్స్‌లో దాదాపు 5 కోట్ల విలువ చేసే ఒక ఇల్లు కూడా ఉంది. అయితే ఎంత సంపాదించినా కూడా చాలా సింప్లిసిటీ మెయింటేన్ చేయడం అనసూయ గొప్పతనం.

అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)
అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj)


ప్రస్తుతం ఏడాదికి ఎంత తక్కువ అనుకున్నా కూడా 2 కోట్లకు పైగానే సంపాదిస్తుంది అనసూయ. అందులో యాంకరింగ్ నుంచే 20 లక్షల వరకు సంపాదిస్తుంది ఈమె.. దాంతో పాటు షోలు.. మధ్యలో ఈవెంట్స్.. సినిమాలన్నీ కలుపుకుంటే కోట్ల ఆదాయం వస్తుందిప్పుడు. క్రేజ్ ఉన్నపుడే కదా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చెబుతుంది అనసూయ. కష్టపడుతున్నపుడు సంపాదించుకోవడంలో తప్పు లేదు కదా. ఇదే అనసూయ ఒకప్పుడు ఖాళీగా ఉన్నపుడు ఎవరూ పట్టించుకోలేదు.. ఇప్పుడు సంపాదిస్తుంది కాబట్టి వార్తల్లో నిలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు