Anasuya : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు యాంకర్ అనసూయ క్షమాపణ

Jabardasth Anchor Anasuya : క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలిచిన యాంకర్ అనసూయ భరద్వాజ్ పొరపాటున టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

news18-telugu
Updated: September 13, 2019, 11:41 AM IST
Anasuya : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు యాంకర్ అనసూయ క్షమాపణ
జబర్దస్త్ యాంకర్ అనసూయ,టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న
  • Share this:
నల్లమల అడవుల్లో యురేనియం వెలికితీతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఈ చర్య వల్ల భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరగనుంది. అంతేకాదు,యురేనియం తవ్వకాలు జరిపినచోట.. ప్రజల ఆరోగ్యాలపై ఏళ్ల తరబడి తీవ్ర దుష్ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు #SaveNallamala క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. తాజాగా జబర్దస్త్ యాంకర్,సినీ నటి అనసూయ కూడా ఈ క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలిచారు. అయితే ట్విట్టర్‌లో దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనసూయ.. పొరపాటున మాజీ అటవీశాఖ మంత్రి జోగు రామన్నను ట్యాగ్ చేశారు. ఆపై తప్పును సరిదిద్దుకుని జోగు రామన్నకు క్షమాపణలు చెప్పారు.

'కరెంట్ ఎఫైర్స్‌‌పై అవగాహన రాహిత్యంతో ఇలా ఒకరిని క్షమాపణ అడిగే రోజు వస్తుందనుకోలేదు. జోగు రామన్న గారికి క్షమాపణలు చెబుతున్నాను. ఈ
మెసేజ్‌ను ప్రస్తుత అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫార్వర్డ్ చేస్తున్నాను.' అనసూయ తన ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు.ఇక నల్లమల గురించి ప్రస్తావిస్తూ.. 'ఇదేనా మన ఫ్యూచర్..? యురేనియం తవ్వకాలకు ఎలా అనుమతినిస్తున్నారు..? ఆలోచించడానికే భయమేయలేదా..? మనం మనుగడ సాగించాలంటే ప్రకృతి కూడా మనుగడ సాగించాలి.' అని చెప్పుకొచ్చారు. కాగా, ఇదే విషయంపై అంతకుముందు హీరో విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో స్పందించిన సంగతి తెలిసిందే. యురేనియం కొనవచ్చు గానీ అడవిని కొనగలమా..? అని విజయ్ అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు