HOME »NEWS »MOVIE »jabardasth anchor anasuya bharadwaj and bigg boss winner rahul sipligunj ali reza anchor ravi play hide and seek game ta

అనసూయతో బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ హైడ్ అండ్ సీక్.. అంతా ఓపెన్‌గానే..

అనసూయతో బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ హైడ్ అండ్ సీక్.. అంతా ఓపెన్‌గానే..
అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్ (Twitter/Photo)

కరోనా వైరస్ కట్టడితో భాగంగా మన దేశంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో అత్యవసర సేవలు చేసేవాళ్లు తప్పించిన అందరు ఇంట్లోనే ఉన్నారు.ఈ లాక్‌డౌన్‌లో యాంకర్ అనసూయ, బిగ్‌బాస్ విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు యాంకర్ రవి, ఆలీ రెజాతో కలిసి హైడ్ అండ్ సీక్ ఆట ఆడింది.

  • Share this:
    కరోనా వైరస్ కట్టడితో భాగంగా మన దేశంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో అత్యవసర సేవలు చేసేవాళ్లు తప్పించిన అందరు ఇంట్లోనే ఉన్నారు. ఈ లాక్‌డౌన్‌ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన అన్ని షూటింగ్స్‌కు బ్రేక్ వచ్చింది. దీంతో ఎపుడు ఏదో ఒక వ్యాపకంతో ఉండే హీరో, హీరోయిన్స్, యాంకర్లు టైమ్ పాస్ కోసం ఏదో ఎంటర్టైన్మెంట్‌ను ప్రేక్షకులకు తమదైన రీతిలో ఎంటర్టైన్ చేస్తున్నారు. రీసెంట్‌గా శ్రీముఖి, విష్ణు ప్రియ, అవినాష్ కలిసి బతుకు బలైపోయిన బండి అనే స్పూఫ్ కామెడీ షో చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా  మీలో ఎవరికి బోర్ కొడుతుంది అనే స్పూఫ్ వీడియోతో ఆకట్టకున్నారు. తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్, బి‌గ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ రవి, ఆలీ రెజా వీళ్లందరు కలిసి హైడ్ అండ్ సీక్. అంటే దాగుడు మూతలు ఆట ఆడుకున్నారు. ఇందులో యాంకర్ రవి లాప్‌టాప్‌లో పని చేసుకుంటుండగా ఆయన బిడ్డ వియా వచ్చి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడమని చెప్పడం.. రవి ఓకే అనడం. వీళ్లిద్దరు మొదలుపెట్టిన ఈ గేమ్‌లో అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా ఎలా ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్‌కు ఫన్ తెప్పించారు. వీళ్లు ఆడిన ఈ దాగుడు మూతల ఆట ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:April 26, 2020, 14:41 IST

    टॉप स्टोरीज