జబర్ధస్త్‌ అనసూయ అమెరికా యాత్ర.. దేని కోసమో తెలుసా..

ఒకవైపు జబర్థస్త్ యాంకర్‌గా పుల్ బిజీగా ఉన్న అనసూయ.. మరోవైపు సినిమాలతో రఫ్ ఆడిచ్చేస్తోంది. ఈ గ్యాప్‌లోనే అనసూయ అమెరికాకు తన ఫ్యామిలీతో కలిసి వెళ్లింది.

news18-telugu
Updated: July 6, 2019, 4:03 PM IST
జబర్ధస్త్‌ అనసూయ అమెరికా యాత్ర.. దేని కోసమో తెలుసా..
నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చూపించాలనుకుంటుంది అనసూయ భరద్వాజ్. అందుకే కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి నిర్మాణం కూడా మొదలు పెడుతుంది అనసూయ.
  • Share this:
ఒకవైపు జబర్థస్త్ యాంకర్‌గా పుల్ బిజీగా ఉన్న అనసూయ.. మరోవైపు సినిమాలతో రఫ్ ఆడిచ్చేస్తోంది. ఈ గ్యాప్‌లోనే అనసూయ అమెరికాకు తన ఫ్యామిలీతో కలిసి వెళ్లింది. ప్రస్తుతం అమెరికాలో తానా సభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అనసూయ అక్కడి వెళ్లినట్టు సమాచారం. అంతేకాదు అక్కడి తెలుగు వాళ్ల కోసం అనసూయ స్పెషల్‌గా ఒక స్కిట్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా పలువురు మీడియా చానెళ్ల అధిపతులు కూడా తానా సభలకు హాజరయ్యారు. ఇక అనసూయ ఈ అమెరికాకు తన ఫ్యామిలీతో కలిసి వచ్చింది. అంతేకాదు అక్కడ మన దేశానికి తొలిసారి క్రికెట్‌లో ప్రపంచ కప్ సాధించి పెట్టిన కపిల్ దేవ్‌తో కలిసి ఫోటో దిగి సందడి చేసింది. ఈ సందర్భంగా కపిల్ దేవ్‌తో కలిసి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మొత్తానికి అనసూయ తన అమెరికా యాత్ర బాగానే వర్కౌట్ అయినట్టు కనపిస్తోంది. 
View this post on Instagram
 

Meanwhile at where I am!!! Taking #Ikkat wherever I go!! @studiobustle 🤩


A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on
First published: July 6, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading