నాకు 16 ఏళ్లు ఉన్నప్పటినుంచి ఆయనతోనే.. : అనసూయ భరద్వాజ్

Anasuya Bharadwaj : కథనం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భర్తతో ఉన్న అటాచ్‌మెంట్ గురించి అనసూయ ఆసక్తికర విషయం వెల్లడించారు.

news18-telugu
Updated: August 13, 2019, 7:50 PM IST
నాకు 16 ఏళ్లు ఉన్నప్పటినుంచి ఆయనతోనే.. : అనసూయ భరద్వాజ్
యాంకర్ అనసూయ Photo: Instagram
  • Share this:
బుల్లితెరను, వెండితెరను రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్న అనసూయ భరద్వాజ్.. కథనం సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కథనం ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు ధనరాజ్‌తో కలిసి ఆమె పలు టీవీ, యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనరాజ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.మీకేదైనా సమస్య వస్తే టక్కున ఎవరికి కాల్ చేస్తారని ధనరాజ్ అడగ్గా.. ఇంకెవరికి మా ఆయనకే చేస్తా అని అనసూయ బదులిచ్చింది.తనకు 16ఏళ్ల వయసున్నప్పటి నుంచే ఆయనతో అటాచ్‌మెంట్ ఏర్పడిందని.. ఆయన తప్ప ఇంకెవరికి తన లైఫ్‌లో స్పేస్ లేదని స్పష్టం చేసింది.

ఇక చిరంజీవి-కొరటాల సినిమాలో చేస్తున్న రోల్ గురించి చెప్పాలని ధనరాజ్ కోరగా.. దాని గురించి ఇంకా తనకే కన్ఫర్మేషన్ లేదని చెప్పింది.అగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో మరో సినిమా మొదలు కాబోతోందని.. ఇండస్ట్రీలో అది కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని ధీమాగా చెప్పారు. ఏ సినిమా అయినా సరే.. మొదట కథకి తను ప్రియారిటీ ఇస్తానని, తర్వాత నిర్మాతలు ఎవరన్నది చూస్తానని తెలిపారు.
ఏదేమైనా వరుస సినిమాలతో రెగ్యులర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అనసూయ దూసుకెళ్తున్నారు.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు