సారీ కోసం అనసూయ వెయిటింగ్... ఏం జరిగిందో సస్పెన్స్

కారణం ఏంటో తెలియదు కానీ... ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సారీ కోసం ఎదురుచూస్తున్నానని అనసూయ ట్వీట్ చేసింది.

news18-telugu
Updated: May 22, 2019, 10:53 PM IST
సారీ కోసం అనసూయ వెయిటింగ్... ఏం జరిగిందో సస్పెన్స్
జబర్ధస్త్ యాంకర్ అనసూయ
news18-telugu
Updated: May 22, 2019, 10:53 PM IST
జబర్దస్త్ యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. సమ్మర్ వెకేషన్ కోసం జమ్మూకాశ్మీర్‌లో గుల్‌మార్గ్‌కు వెళ్లిన ఈ అందాల భామ... అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్‌ను క్షమాపణలు కోరడం హాట్ టాపిక్‌గా మారింది. కారణం ఏంటో తెలియదు కానీ... స్పైస్ జెట్ సారీ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ఆమె ట్విట్ చేయడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
అసలు అనసూయకు తలెత్తిన ఇబ్బంది ఏమిటి... ఆమె స్పైస్ జెట్ నుంచి ఎందుకు క్షమాపణలు కోరిందనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే అనసూయ ట్వీట్‌కు స్పందించిన స్పైస్ జెట్ సంస్థ... అసలు ఏం జరిగిందో తమకు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆమెకు సూచించింది. అయితే గుల్‌మార్గ్ వెళ్లిన అనసూయకు స్పైస్‌జెట్ సర్వీసుల్లో ఏదో ఇబ్బంది కలిగినట్టు ఉంటుందని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి అనసూయ అసహనానికి కారణమేంటి... స్పైస్ జెట్ సంస్థ అమెకు క్షమాపణలు చెబుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.


First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...