అనసూయ దెబ్బకు.. ఆలోచనలో పడ్డ జబర్దస్త్ టీమ్..

Jabardasth Anasuya : నాగబాబు జంప్ అవడం, అనసూయ కూడా వెళ్తుండటం వల్ల జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లపై ప్రభావం పడుతుందేమోనని మల్లెమాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

news18-telugu
Updated: December 1, 2019, 2:03 PM IST
అనసూయ దెబ్బకు.. ఆలోచనలో పడ్డ జబర్దస్త్ టీమ్..
అనసూయ భరద్వాజ్ (File)
  • Share this:
తెలుగులోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ షో.. జబర్దస్త్. నవ్వులు పూయించడమే లక్ష్యంగా బుల్లి తెర మీదకు వచ్చిన ఈ కార్యక్రమం.. ఊహించనంత ఫాలోయర్లను సంపాదించుకుంది. ఆ షోకు పోటీగా లోకల్ గ్యాంగ్స్ పేరుతో కొత్త షో ఈ మధ్యే తెరపైకి వచ్చింది. వచ్చీ రావడంతోనే జబర్దస్త్‌కు ఆయువు పట్టులా ఉన్న కీలక ఆర్టిస్టులను లాగేసుకుంటోంది. ప్రధానంగా జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు ఆ కొత్త షోకు జంప్ అయ్యాడు. జబర్దస్త్ గ్లామర్ బ్యూటీ అనసూయ కూడా నేడో, రేపో గోడ దూకేసేందుకు సిద్ధంగా ఉంది. వారితో పాటు.. చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ కూడా లోకల్ గ్యాంగ్స్‌కు జై కొట్టారు. అదే సమయంలో.. ‘ఢీ’కి జడ్జిగా వ్యవహరించిన శేఖర్ మాస్టర్, యాంకర్స్ రవి, ప్రదీప్ మాచిరాజు కూడా నాగబాబు బాటలోనే గోడ దూకేశారు. అయితే.. ఈ రెండు షోలకు నిర్మాత మల్లెమాల ప్రొడక్షన్. వీళ్లంతా కొత్త షోకు పయనం అవడంతో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ ప్రోగ్రాంలపై ప్రభావం పడుతుందేమోనని మల్లెమాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

వాస్తవానికి, ఏ టీవీ షోకు రాని క్రేజ్ జబర్దస్త్‌కు వచ్చింది. దాన్ని ఢీ కొట్టాలంటే అంతటి సత్తా, స్టామినా ఉండాల్సిందే. అందుకే.. కొత్త ప్రోగ్రాం నిర్వాహకులు వీలైనంతగా నవ్వులు పండించేందుకు ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే, టీఆర్‌పీ రేటింగ్‌లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న జబర్దస్త్‌ను కొత్త షో ఢీ కొట్టగలదా? అన్నదే ప్రధాన సందేహం. కొత్త షో వచ్చేసినా.. గురువారం, శుక్రవారం ప్రసారమైన జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ టీఆర్‌పీ ఏమాత్రం పడిపోలేదని సమాచారం.

దీన్ని బట్టి చూస్తే మల్లెమాల ప్రొడక్షన్స్‌కు ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదని అవగతం అవుతోంది. కొందరు టీం లీడర్లను మార్చి, కొందర్ని జబర్దస్త్ నుంచి ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు పంపించి.. యంగ్ హీరోలను షోకు రప్పిస్తున్న మల్లెమాల బృందం.. వ్యూయర్‌షిప్ తగ్గిపోకుండా జాగ్రత్త పడుతోంది.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>