జబర్దస్త్ వినోద్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? అసలు రెమ్యునరేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు..?

Jabardasth Vinod : తన పనేదో తాను చేసుకుని వెళ్లడమే తప్పించి.. మిగతా టీమ్ సభ్యుల రెమ్యునరేషన్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నాడు జబర్దస్త్ హాస్య నటుడు వినోద్.

news18-telugu
Updated: August 27, 2019, 12:04 PM IST
జబర్దస్త్ వినోద్  ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? అసలు రెమ్యునరేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో నటించే హాస్యనటుల రెమ్యునరేషన్ వివరాలు తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంటుంది.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పలానా టీమ్ మెంబర్‌కి అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అని.. పలానా నటుడికి తక్కువ అని.. చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి. అయితే జబర్దస్త్ నటులు మాత్రం స్వయంగా వారి రెమ్యునరేషన్ వివరాలను ఎక్కడా ఎప్పుడు వెల్లడించలేదు. కానీ జబర్దస్త్ నటుడు వినోద్ మాత్రం తన రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తన రెమ్యునరేషన్ ఒక ఎపిసోడ్‌కు రూ.1000 అని చెప్పాడు. తన పనేదో తాను చేసుకుని వెళ్లడమే తప్పించి.. మిగతా టీమ్ సభ్యుల రెమ్యునరేషన్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నాడు. ఇక ఇప్పుడు తనకు అందుతున్న రెమ్యునరేషన్ గురించి మాత్రం వినోద్ ఏమీ చెప్పలేదు. టీమ్ సభ్యుల రెమ్యునరేషన్‌ను మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి, జబర్దస్త్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారని చెప్పాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు.

ఇదిలా ఉంటే, ఇటీవలే ఓ ఇంటి కొనుగోలు వ్యవహారంలో యజమాని చేతిలో తీవ్ర గాయాలపాలైన తను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు వినోద్ తెలిపాడు. ఆరోగ్యం కుదుటపడేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పాడు. కంటిపై బలమైన గాయం కావడంతో.. కోలుకోవడానికి మరింత విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినట్టు తెలిపాడు. త్వరలోనే తిరిగి మేకప్ వేసుకుని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తానని ధీమాగా చెప్పాడు.

ఇది కూడా చదవండి : ఒక కన్ను చూపు పోయింది.. నరకం అనుభవిస్తున్నా : జబర్దస్త్ వినోద్

First published: August 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...