జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది యువ నటులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త కమెడియన్లను పరిచయం చేసింది. ఈ కామెడీ షోకు ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు. ఇది రొటీన్‌గా జరిగేదే. వండర్స్ వేణు, ధనాధన్ ధన్రాజు, షకలక శంకర్, షేకింగ్ శేషుతో పాటు పలువురు నటులు జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పి సినిమాల్లో చేసుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం జబర్దస్త్‌లో మెరిసినా.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. వారిలో ఒకరు సాయితేజ అలియాస్ పింకీ.
జబర్దస్త్‌లో ఒకప్పుడు చాలా స్కిట్స్ చేసిన సాయితేజ.. ప్రస్తుతం ఆ షోకు దూరంగా ఉంది. లేడీ గెటప్స్‌తో పాపులరైన సాయితేజ.. ఆ తర్వాత నిజంగానే అమ్మాయిగా మారిపోయాడు. జెండర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకొని యువతిగా మారాడు. తన పేరును ప్రియాంక సింగ్‌గా మార్చుకొని.. ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించింది. టిక్ టాక్‌లో యాక్టివ్‌గా ఉండే పింకీ.. అభిమానులతో టచ్‌లో ఉంటూ సినిమాలు, బుల్లి తెరపై అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బంపరాఫర్ కొట్టేసింది పింకీ.
జీ తెలుగులో ప్రసారం అయ్యే గుండమ్మ కథ సీరియల్లో సాయి పింకీకి అవకాశం దక్కింది. సోమవారం నుంచి ఆ ఎసిసోడ్లు ప్రసారం కానున్నాయి. తనను ఇన్నాళ్లు ఎంతగానో ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. తాను నటించనున్న కొత్త సీరియల్ కూడా చూడాలని పేర్కొంది. గుండమ్మ కథలో రియాగా కనిపించబోతోంది సాయి పింకీ. ఫ్యాషన్ డిజైనర్‌గా నెగెటివ్ షేడ్‌లో విలన్‌గా కనిపించనున్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఓటమి అనేది తన హిస్టరీలోనే లేదంటూ డైలాగ్స్‌తో అదరగొట్టింది. మరి ఆమె నిజంగానే విలన్ పాత్ర పోషించిందా? లేదా? అనేది ఇవాళ్టి ఎపిసోడ్ తర్వాత తెలియనుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.