Jr Ntr: అందుకే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల మీద పడ్డా.. క్లారిటీ ఇచ్చిన జబర్ధస్త్ కమెడియన్

ఎన్టీఆర్ కొత్త లుక్ (Twitter/Photo)

Jr Ntr-Raising Raju: రైజింగ్ రాజు జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు మొక్కడానికి ఎందుకు ప్రయత్నించారనే అంశం చాలామందికి అర్థంకాలేదు.అయితే దీని వెనుక అసలు కథ వేరే ఉందనే విషయాన్ని రైజింగ్ రాజు స్వయంగా తెలిపారు.

  • Share this:
    ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో టాలీవుడ్ క్రేజీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు మొక్కేందుకు జబర్ధస్త్ నటుడు రైజింగ్ రాజు ప్రయత్నించారు. అయితే తనకంటే వయసులో పెద్దవాడైన రైజింగ్ రాజు చేయబోయే పనిని జూనియర్ ఎన్టీఆర్ వారించాడు. మీరు ఇలా చేయకూడదని.. నేను మీ కంటే వయసులో చిన్నవాడినని చెప్పి ఆయనను అప్యాయంగా పలకరించారు. ఆయన శాలువాతో సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఓ మొక్కను బహూకరించారు. అయితే రైజింగ్ రాజు జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు మొక్కడానికి ఎందుకు ప్రయత్నించారనే అంశం చాలామందికి అర్థంకాలేదు.అయితే దీని వెనుక అసలు కథ వేరే ఉందనే విషయం రైజింగ్ రాజు స్వయంగా తెలిపారు.

    అసలు జూనియర్ ఎన్టీఆర్‌ను చూడగానే తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఆయన కూలంకషంగా వివరించారు. తాను పరుచూరి బ్రదర్స్ దగ్గర ఉన్న సమయంలో నటరత్న ఎన్టీఆర్‌‌ను కలిసే అవకాశం వచ్చిందని.. ఆ సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నానని రైజింగ్ రాజు తెలిపాడు. ఆ తరువాత తన సన్నిహితుల ద్వారా హరికృష్ణను కూడా పలుసార్లు కలిసి ఆయన అశీర్వాదం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.

    సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణను కలిసిన తాను జూనియర్ ఎన్టీఆర్‌ను చూడగానే తనకు సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ గుర్తుకు వచ్చారని.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు మొక్కాలని అనుకున్నానని రైజింగ్ రాజు భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాదు సంస్కారం విషయంలో సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం తీసిపోరని అన్నారు. తాను జీవించి ఉన్నంతకాలం జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన శాలువా, షీల్డ్, మొక్కను భద్రపరుచుకుంటానని రైజింగ్ రాజు చెప్పుకొచ్చారు.
    Published by:Kishore Akkaladevi
    First published: