హైపర్ ఆది పేరు చెప్పగానే నాగబాబు ఫైర్...మెగా ఫ్యామిలీతో ఫైట్...

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Jabardasth comedian Hyper Aadi)

పవన్ కల్యాణ్, విమర్శించే ప్రతి ఒక్కరి మీదా తన స్కిట్లలో పంచులు వేసేవాడు. అంతేకాదు నాగబాబు ఎన్నికల్లో నిలబడితే హైపర్ ఆది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.

 • Share this:
  హైపర్ ఆది అంటే మెగా ఫ్యామిలీకి వీర విధేయుడు. కత్తి మహేష్ ఇష్యూలో హైపర్ ఆది రియాక్ట్ అయిన తీరు చూస్తేనే అతడు ఎంతటి డైహార్డ్ ఫ్యానో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు పవన్ కల్యాణ్, విమర్శించే ప్రతి ఒక్కరి మీదా తన స్కిట్లలో పంచులు వేసేవాడు. అంతేకాదు నాగబాబు ఎన్నికల్లో నిలబడితే హైపర్ ఆది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే జబర్దస్త్ నుంచి నాగబాబు జీ తెలుగులో అదిరింది అనే షో వెళ్లిపోయాడు. హైపర్ ఆది మాత్రం తెలివిగా అక్కడే ఉండిపోయాడు. నాగబాబు తన వెంట హైపర్ ఆది రావడం ఖాయమని జీ తెలుగు వారికి చెప్పేశాడు. అయితే హైపర్ ఆది మాత్రం ఎమ్మెల్యే రోజా జోక్యంతో జబర్దస్త్ లోనే ఉండిపోయాడు. నిజానికి హైపర్ ఆది తీసుకున్న నిర్ణయం కరెక్టే అని తేలింది.

  అయితే నాగబాబు వెళ్లిపోయినా జబర్దస్త్ రోజా ఒంటి చేత్తోనే మంచి టీఆర్పీలు సాధిస్తోంది. అయితే అటు అదిరింది షో మాత్రం పెద్ద మెరుపులేమి లేవు. దీంతో ఫ్రస్ట్రేషన్ నాగబాబులో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా హైపర్ ఆదిపై నాగబాబు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి భజన చేసి, చివరకు ఇలా హ్యాండ్ ఇస్తాడని భావించలేదు. అందుకేనేమో మొన్న యూట్యూబ్ లో నాగబాబు పెట్టిన లైవ్ లో కేవలం మాస్ అవినాష్, గెటప్ శ్రీనులతోనే మాట్లాడాడు. హైపర్ ఆదిని అవాయిడ్ చేశాడు.

  నిజానికి చమ్మక్ చంద్ర జీ తెలుగుకు వచ్చి బాగా దెబ్బతిన్నాడు. జబర్దస్త్‌లోనే ఉండి ఉంటే తన రేంజ్ వేరు. అయితే హైపర్ ఆది తన కెరీర్ దృష్ట్యా ఎమెల్యే రోజా మాటను విని మంచి నిర్ణయం తీసుకున్నాడని అతడి అభిమానులు భావిస్తున్నారు. అయితే నాగబాబు మాత్రం హైపర్ ఆది విషయంలో కాస్త ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
  Published by:Krishna Adithya
  First published: