హోమ్ /వార్తలు /సినిమా /

Varsha- Emmanuel: అప్పుడు అనిపించింది వీడు నా వాడ‌ని.. ఇమ్ము కేరింగ్‌పై వ‌ర్ష‌

Varsha- Emmanuel: అప్పుడు అనిపించింది వీడు నా వాడ‌ని.. ఇమ్ము కేరింగ్‌పై వ‌ర్ష‌

రియల్ లైఫ్‌లో కాకపోయినా రీల్ లైఫ్‌లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాతే వాళ్ల కెరీర్‌కు మరింత రెక్కలొచ్చాయి. వాళ్లే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది. సుధీర్ అంటే వెంటనే మరో పేరు కూడా గుర్తొస్తుంది. అదే రష్మి గౌతమ్. ఈ ఇద్దరి మధ్య ఏం లేదని అందరికీ తెలుసు.. కానీ ఏదో ఉందనే భ్రమతోనే సుధీర్ కెరీర్ మారిపోయింది.

రియల్ లైఫ్‌లో కాకపోయినా రీల్ లైఫ్‌లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాతే వాళ్ల కెరీర్‌కు మరింత రెక్కలొచ్చాయి. వాళ్లే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది. సుధీర్ అంటే వెంటనే మరో పేరు కూడా గుర్తొస్తుంది. అదే రష్మి గౌతమ్. ఈ ఇద్దరి మధ్య ఏం లేదని అందరికీ తెలుసు.. కానీ ఏదో ఉందనే భ్రమతోనే సుధీర్ కెరీర్ మారిపోయింది.

Varsha- Emmanuel: ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌లో సుధీర్-ర‌ష్మి జోడీ త‌రువాత అంత క్రేజ్ సంపాదించుకున్న మ‌రో పెయిర్ వ‌ర్ష‌-ఇమ్మాన్యుల్. గ‌త కొన్ని రోజులుగా స్కిట్స్‌లో ఇమ్మాన్యుయేల్‌తో కలిసి రొమాన్స్ చేస్తుంది. అప్పుడ‌ప్పుడు వ‌ర్ష‌ వేరే వారికి పెయిర్‌గా న‌టించినా.. ఇమ్మాన్యుల్‌తోనే ఆమె రొమాన్స్ బావుంటుంది.

ఇంకా చదవండి ...

Varsha- Emmanuel: ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌లో సుధీర్-ర‌ష్మి జోడీ త‌రువాత అంత క్రేజ్ సంపాదించుకున్న మ‌రో పెయిర్ వ‌ర్ష‌-ఇమ్మాన్యుల్. గ‌త కొన్ని రోజులుగా స్కిట్స్‌లో ఇమ్మాన్యుయేల్‌తో కలిసి రొమాన్స్ చేస్తుంది. అప్పుడ‌ప్పుడు వ‌ర్ష‌ వేరే వారికి పెయిర్‌గా న‌టించినా.. ఇమ్మాన్యుల్‌తోనే ఆమె రొమాన్స్ బావుంటుంది. ఈ ఇద్దరిపై రాసిన స్కిట్లు కూడా బాగానే పేలుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్‌గా పేరొందిన ఈ ఇద్ద‌రు కేవ‌లం జ‌బ‌ర్ద‌స్త్‌లోనే కాకుండా మ‌రికొన్ని షోల‌లో కూడా ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు వీరిద్ద‌రి ఆన్ స్క్రీన్ రొమాన్స్ హ‌ద్దులు దాటిపోతుంద‌ని కామెంట్లు వ‌చ్చినా.. వీరు మాత్రం దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. స్క్రిప్ట్‌లోనే అలా రాస్తారో లేక వీరిద్ద‌రు ఇంప్ర‌మైజ్ చేసుకుంటారో తెలీదు గానీ.. ఈ జోడీ మాత్రం సుధీర్-ర‌ష్మి జోడీకి బాగా పోటీ ఇస్తోంది.

కాగా స్కిట్‌ల‌ను ప‌క్క‌న‌పెడితే ఈ ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ వ‌స్తున్నారు. జ‌డ్జిలు జ‌డ్జిమెంట్ ఇచ్చే స‌మయంలో ఇమ్ము, వ‌ర్ష త‌మ త‌మ ప్రేమ గురించి చెబుతూ వ‌స్తుంటారు. అదంతా టీఆర్పీ రేటింగ్ కోస‌మో లేక నిజంగానే వీరిద్ద‌రి మ‌న‌సులోని భావాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారా అన్న విష‌యాల‌ను ప‌క్క‌న‌పెడితే తాజాగా ఇమ్మాన్యుల్ త‌న‌పై చూపించిన ప్రేమ గురించి వ‌ర్ష ఒక సంఘ‌ట‌న‌ను బ‌య‌ట‌పెట్టింది.

ఏదో యూట్యూబ్ ఛానెల్‌లో త‌న ఫొటో పెట్టి సూసైడ్ చేసుకున్నట్లుగా ఒక న్యూస్‌ని పెట్టారు. అది రాత్రి స‌మయంలో ఎప్పుడో చూసి వెంట‌నే ఇమ్మాన్యుల్ నాకు కాల్ చేశాడు. నువ్వు బావున్నావు క‌దా అని న‌న్ను అడిగాడు. అప్పుడు అనిపించింది. వీడు నావాడ‌ని అని జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్‌పై వ‌ర్ష త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచారు. మ‌రి నిజంగానే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఉందా అన్న విష‌యంపై త్వ‌ర‌లోనేనైనా వీరు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

First published:

Tags: Emmanuel, Jabardast Varsha

ఉత్తమ కథలు