Home /News /movies /

JABARDAST JUDGE ROJA COMMENTS ON ROCKET RAGHAVA JABARDAST LATEST PROMO MNJ

Roja- Raghava: ఇలా చేసుంటే వార్డు మెంబ‌ర్ అయ్యేవాడిన‌న్న రాఘ‌వ‌.. రోజా రియాక్ష‌న్ ఇదే

రోజా రాకెట్ రాఘవ

రోజా రాకెట్ రాఘవ

Roja- Raghava: తెలుగు బుల్లితెర‌పై నవ్వులు పూయించే షోల‌లో జ‌బ‌ర్ద‌స్ట్ ఒక‌టి. ఈటీవీలో వ‌చ్చే ఈ షో ఎంతో మంది క‌మెడియ‌న్లకు లైఫ్‌ని ఇచ్చింది. అంతేకాదు మ‌రికొంద‌రికి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఈ షోకు పోటీగా మిగిలిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ల‌లో షోలు వ‌చ్చినా అవేవీ జ‌బ‌ర్ద‌స్త్‌ని ఢీ కొట్ట‌లేక‌పోయాయి

ఇంకా చదవండి ...
    Roja- Raghava: తెలుగు బుల్లితెర‌పై నవ్వులు పూయించే షోల‌లో జ‌బ‌ర్ద‌స్ట్ ఒక‌టి. ఈటీవీలో వ‌చ్చే ఈ షో ఎంతో మంది క‌మెడియ‌న్లకు లైఫ్‌ని ఇచ్చింది. అంతేకాదు మ‌రికొంద‌రికి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఈ షోకు పోటీగా మిగిలిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ల‌లో షోలు వ‌చ్చినా అవేవీ జ‌బ‌ర్ద‌స్త్‌ని ఢీ కొట్ట‌లేక‌పోయాయి. ఇక ఈ షో ప్రారంభం నుంచి ఇందులో ఉన్న వారిలో చ‌లాకీ చంటి ఒక‌రు. ఈ క్ర‌మంలో ఆ మధ్య‌న చంటికి స‌న్మానం కూడా చేశారు. కాగా ప్ర‌తి గుర‌వారం రాత్రి ఈ షో ప్రసారం అవుతూ వ‌స్తుండ‌గా.. వ‌చ్చే వారానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌ల అయ్యింది. అందులో రాకెట్ రాఘ‌వ త‌న భార్య‌కు నిద్ర‌లో లేచే అల‌వాటు ఉంద‌ని చెబుతాడు. ఆమెను వెతికి తీసుకొచ్చే స‌రికి అర్ధ‌రాత్రి అవుతుంద‌ని.. ఆ త‌రువాత మ‌ళ్లీ న‌డిచి బ‌య‌ట‌కు వెళితే త‌న బ‌తుకు తెల్లారిపోతుంద‌ని కామెంట్లు చేస్తాడు.

    ఈ న‌డిచేదేదో ఎల‌క్ష‌న్‌లో న‌డిచినా వార్డు మెంబ‌ర్‌గా గెలిచేవాడిన‌ని రాఘ‌వ అన్నాడు. దానికి వెంట‌నే జ‌డ్జి రోజా.. మొహ‌మాట‌ప‌డ్డ‌ట్లు ఉన్నావు. ప‌ర్లేదు ఎమ్మెల్యే అనుకో అని అంటుంది. దాంతో రాఘ‌వ వ‌ద్ద‌ని చేతుల‌తో చెబుతాడు. కాగా రోజా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 2014, 2019 ఎన్నికల్లో రోజా పోటీ చేయ‌గా.. రెండుసార్లు గెలిచారు. అంతేకాదు ఎమ్మెల్యే అవ్వ‌క‌ముందు రోజా కూడా పాద‌యాత్ర‌ను చేశారు. ఇక‌ ఇప్పుడు రాఘ‌వ‌పై ఫ‌న్నీగా ఆమె కామెంట్లు చేశారు.


    ఇక ఈ ప్రోమోలో హైప‌ర్ ఆది, దొర‌బాబుపై మ‌రోసారి కామెంట్లు చేశాడు. ఇందులో దొర‌బాబు, ఆదికి కుమారుడిగా నటించ‌గా.. వారు గోవాకు వెళ‌తారు. అక్క‌డంటే ప‌ట్టుకుంటే చేతులు మొక్కితే వ‌దిలేశారు. ఇక్క‌డ క‌ష్టం అంటూ దొర‌బాబును ఉద్దేశించి మాట్లాడాడు. మ‌రోవైపు అభి.. పెళ్లి అయి పారిపోవాల‌నిపించినా త‌ట్టుకొని ఇంట్లో ఉండేవాడు మ‌గాడు అంటూ కామెంట్లు చేశాడు. మొత్తానికి ఈ ప్రోమో ఫ‌న్నీ ఫ‌న్నీగా ఉండ‌గా.. ఫుల్ ఎపిసోడ్ మ‌రింత ఫ‌న్‌గా ఉండ‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Jabardasth, Roja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు