హోమ్ /వార్తలు /సినిమా /

Sankranthi Special programs: అక్కడ గెటప్ శ్రీను.. ఇక్కడ ముక్కు అవినాష్.. సేమ్ టు సేమ్

Sankranthi Special programs: అక్కడ గెటప్ శ్రీను.. ఇక్కడ ముక్కు అవినాష్.. సేమ్ టు సేమ్

గెటప్ శ్రీను, ముక్కు అవినాష్

గెటప్ శ్రీను, ముక్కు అవినాష్

సంక్రాంతి సంబ‌రాల్లో భాగంగా తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో స్పెష‌ల్ ప్రోగ్రామ్‌లు ప్ర‌సారం కానున్న విష‌యం తెలిసిందే. ఈటీవీలో అత్తో అత్త‌మ్మ కూతురో(Atto Attamma Kuturo), స్టార్ మాలో ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ(It's a family party), జీ తెలుగులో సంక్రాంతి సంబ‌రాలు 2021(Sankranthi Sambaralu 2021) పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్‌లు బుల్లితెర ప్రేక్ష‌కుల కోసం రానున్నాయి.

ఇంకా చదవండి ...

Sankranthi Special programs: సంక్రాంతి సంబ‌రాల్లో భాగంగా తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో స్పెష‌ల్ ప్రోగ్రామ్‌లు ప్ర‌సారం కానున్న విష‌యం తెలిసిందే. ఈటీవీలో అత్తో అత్త‌మ్మ కూతురో, స్టార్ మాలో ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ, జీ తెలుగులో సంక్రాంతి సంబ‌రాలు 2021 పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్‌లు బుల్లితెర ప్రేక్ష‌కుల కోసం రానున్నాయి. వాటికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా.. ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. కామెడీ, డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్‌, పాట‌ల‌తో వ‌స్తోన్న ఆ ప్రోగ్రామ్‌లు పండుగ పూట అంద‌రినీ ఎంట‌ర్‌టైన్మెంట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్రోమోల‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఇదంతా ప‌క్క‌న‌పెడితే సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ‌గా చెప్పుకుంటారు కాబ‌ట్టి.. రైతుల గొప్ప‌ద‌నం గురించి చూపిస్తూ ఈ ప్రోగ్రామ్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వనున్నారు.

ఇందులో భాగంగా అత్తో అత్త‌మ్మ కూతురు ప్రోగ్రామ్‌లో రైతుల గొప్ప‌ద‌నం, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి గెట‌ప్ శ్రీను ఓ ప‌ర్ఫామెన్స్ ఇవ్వ‌నున్నారు. అందులో చివ‌ర్లో త‌న గొంతు కోసుకున్నాడు శ్రీను. దానికి ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అంద‌రూ కంట‌త‌డి పెట్టుకున్నట్లుగా ప్రోమోలో చూపించారు.

' isDesktop="true" id="719476" youtubeid="W0uEuywWKe4" category="movies">

ఇక స్టార్ మాలో ప్ర‌సారం కానున్న ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ ప్రోగ్రామ్‌లోనూ ఇలాంటి ప‌ర్ఫామెన్స్ ఇవ్వ‌నున్నారు. ముక్కు అవినాష్ ఈ ప‌ర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇందులో అవినాష్ రైతుల సమ‌స్య‌ల‌ను వివ‌రిస్తూ.. చివ‌ర్లో పురుగుల మందు తాగుతాడు. ఆ ఫ‌ర్ఫామెన్స్ త‌రువాత అక్క‌డి వారు భావోద్వేగానికి గురి అయిన‌ట్లు ప్రోమోలో చూపించారు.

ఇలా ఈ రెండు ఫ‌ర్ఫామెన్స్‌లు ఒకేలా ఉన్నాయి. మ‌రోవైపు ఈ ప్రోగ్రామ్‌ల‌లో రానున్న డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్‌లు, కామెడీ స్కిట్‌లు కూడా బాగా ఆక‌ట్టుకుంటున్నాయి.

First published:

Tags: Star Maa, Television News

ఉత్తమ కథలు