Emmanuel- Varsha: ప్రముఖ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్‌లో ఇటీవల బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఇమ్మాన్యుల్. ఆ మధ్య ఎప్పుడో జబర్దస్త్‌లోకి వచ్చినప్పటికీ.. ముక్కు అవినాష్ వెళ్లిన తరువాత కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఇమ్మాన్యుల్కి మంచి స్థానం లభించింది.
Emmanuel- Varsha: ప్రముఖ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్‌లో ఇటీవల బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు ఇమ్మాన్యుల్. ఆ మధ్య ఎప్పుడో జబర్దస్త్‌లోకి వచ్చినప్పటికీ.. ముక్కు అవినాష్ వెళ్లిన తరువాత కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఇమ్మాన్యుల్కి మంచి స్థానం లభించింది. ఇక తనదైన డైలాగ్ డెలివరీతో రెచ్చిపోయిన ఇమ్మాన్యుల్.. చాలా సార్లు కార్తీక్ స్కిట్‌ని గెలిపించారు. ఇక సుధీర్ టీమ్‌కి కూడా బాగా గట్టి పోటీని ఇచ్చాడు ఇమ్మాన్యుల్. తన అందాన్ని ఓ రేంజ్లో ఊహిస్తూ ఇమ్మాన్యుల్ మాట్లాడే మాటలు జబర్దస్త్ వీక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ షోలో ఇమ్మాన్యుల్ పాపులారిటీ సంపాదించుకోవడానికి మరో కారణం వర్ష. జబర్దస్త్‌లోకి వచ్చిన వర్ష కూడా తన పర్ఫామెన్స్తో అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా ఇమ్మాన్యుల్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించడంతో పాటు అతడితో రొమాన్స్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలో జబర్దస్త్ స్టేజ్‌పై సుధీర్, రష్మి జోడీని మరిపించేలా కొత్త జోడీగా తయారయ్యారు.
ఇక జబర్దస్త్ షోలో మాత్రమే కాదు పలు షోలలో కూడా వీరిద్దరు జోడీ కడుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటూ పలువురు కామెంట్లు చేసినప్పటికీ వీరిద్దరు పెద్దగా పట్టించుకోలేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ప్రేమను చూపిస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అది కాస్త మితిమీరడంతో వీరిద్దరి జోడీపై కామెంట్లు వచ్చాయి. వాటిని సీరియస్‌గా ఒక ఎపిసోడ్లో ఇమ్మాన్యుల్ వర్షకు దూరంగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత శరా మామూలుగా మారారు.
ఇదిలా ఉంటే ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఈ ఇద్దరు స్కిట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఆదివారం ప్రసారం అవ్వనున్న ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో ఉప్పెన చిత్రంలోని జల జల జలపాతం నువ్వు పాటకు ఢీ డ్యాన్సర్లు డ్యాన్స్ వేశారు. ఆ తరువాత పండు, భాను కూడా అదే పాటకు డ్యాన్స్ వేయగా.. ఇది కాదు కెమిస్ట్రీ అసలు కెమిస్ట్రీ చూపిస్తానంటూ ఇమ్ము, వర్షను తీసుకొస్తాడు. ఆ పాటకు ఇద్దరు రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. మరి ఈ పాటలో ఈ ఇద్దరు ఎలా చేశారో చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.