హోమ్ /వార్తలు /సినిమా /

MLA Roja - Meena: ఎమ్మెల్యే రోజాతో త్రోబ్యాక్ పిక్ పంచుకున్న మీనా.. వాటే కాంబినేషన్..

MLA Roja - Meena: ఎమ్మెల్యే రోజాతో త్రోబ్యాక్ పిక్ పంచుకున్న మీనా.. వాటే కాంబినేషన్..

రోజాతో మీనా త్రోబ్యాక్ పిక్ (Instagram/Photo)

రోజాతో మీనా త్రోబ్యాక్ పిక్ (Instagram/Photo)

MLA Roja - Meena | ఎమ్మెల్యే రోజాతో త్రోబ్యాక్ పిక్ పంచుకున్న మీనా.. వాటే కాంబినేషన్ అంటున్నారు ఆడియన్స్. వివరాల్లోకి వెళితే.. 

  MLA Roja - Meena: ఎమ్మెల్యే రోజాతో త్రోబ్యాక్ పిక్ పంచుకున్న మీనా.. వాటే కాంబినేషన్ అంటున్నారు ఆడియన్స్. వివరాల్లోకి వెళితే..  మీనా, రోజా (Meena - Roja) వీళ్లిద్దరు కలిసి గతంలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రోజా (Roja) ప్లేస్‌లో మీనా (Meena) జబర్ధస్త్ జడ్జ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి జబర్ధస్త్ షో జడ్జ్‌స్‌గా ఒకే వేదికను పంచుకున్నారు. తాజాగా మీనాతో రోజాతో అన్నపూర్ణ స్టూడియోలో కలిసి ఉన్న పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ప్రతి గురువారం మీనా.. తనకు సంబంధించిన పాత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా మీనా, రోజాతో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.

  వీళ్లిద్దరు కలిసి ఉన్న ఈ ఫోటో 1993లో అన్నపూర్ణ స్టూడియోలో కలిసి ఉన్న సందర్భంలోనిది ఈ ఫోటో.  ఆ టైమ్‌లో మీనా నాగార్జునతో అన్నపూర్ణ స్టూడియోలో ‘అల్లరి అల్లుడు’ సినిమా  చేస్తున్నట్టు చెప్పారు.  ఈ సినిమాను ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసారు. మరోవైపు రోజా.. చిరంజీవి హీరోగా నాగబాబు.. తన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన ‘ముగ్గురు మొనగాళ్లు’ షూటింగ్‌ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఉంది. అపుడు రోజా, చిరంజీవిపై ‘రాజశేఖర’ అనే పాటను పిక్చరైజ్ చేస్తున్న సందర్భంలోనిది చెప్పారు మీనా. అంతేకాదు చిరు, రోజాలపై పిక్చరైజ్ చేసిన ఈ పాట అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పారు.  ఆ సందర్భంగా వీళ్లిద్దరు కలిసి ఉన్న ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  View this post on Instagram


  A post shared by Meena Sagar (@meenasagar16)  మీనా, రోజా విషయానికొస్తే..  ఒకప్పుడు వీళ్లిద్దరు ‘ముఠామేస్త్రీ’,‘బొబ్బిలి సింహం’ వంటి కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఇక స్టార్ డమ్ విషయాకొస్తే..రోజా కంటే ముందు మీనానే ముందుగా హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు టాలీవుడ్. కోలీవుడ్‌లో తమదైన శైలిలో హీరోయిన్స్‌గా రాణించారు. అంతేకాదు అప్పట్లో మీనా చేయాల్సిన ‘సర్పయాగం’ రోజా దగ్గరకి వెళ్లింది. ఆ సినిమాతో రోజా స్టార్ హీరోయిన్‌గా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.  రోజా విషయానికొస్తే.. జబర్ధస్త్ జడ్జ్‌గా రోజా పాపులారిటీ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రోగ్రాంతో రోజా కామన్ ఆడియన్స్ చాలా దగ్గరైంది. అంతేకాదు మొన్నటి వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. రీసెంట్‌గా ఏపీ సీఎం జగన్.. ఆ ప్లేస్‌లో కొత్త వ్యక్తిని నియమించిన సంగతి తెలిసిందే కదా.  ఇపుడు వైసీపీ తరుపున ‘నగరి’ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే కదా.  మీనా విషయానికొస్తే.. వెంకటేష్‌తో ‘దృశ్యం 2’తో త్వరలో  తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మరోవైపు రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. దాంతో పాటు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో ఓ కథానాయికగా నటించబోతున్నట్టు సమాచారం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Meena, MLA Roja, Roja Selavamani, Tollywood

  ఉత్తమ కథలు