హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudheer: ఢీ షోకు ఎందుకు రావడం లేదు... సుడిగాలి సుధీర్‌కు షాక్ ఇచ్చిన ఫ్యాన్

Sudigali Sudheer: ఢీ షోకు ఎందుకు రావడం లేదు... సుడిగాలి సుధీర్‌కు షాక్ ఇచ్చిన ఫ్యాన్

ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. నిజంగానే సుధీర్‌ను మల్లెమాల పక్కన బెడుతుందేమో అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. సుడిగాలి సుధీర్ అంటే కేరాఫ్ జబర్దస్త్ కామెడీ షో. ఈయనకు అదే గుర్తింపు తీసుకొచ్చింది. అంతకుముందు సుధీర్ అంటే ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఓ మెజీషియన్‌గా ఇండస్ట్రీకి వచ్చి.. అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు స్టార్ అయ్యాడు సుడిగాలి సుధీర్.

గత కొన్ని రోజులుగా సుధీర్ ఢీ షోలో కనిపించకుండా పొయాడు. దీంతో అతడి ఫ్యాన్స్ సుధీర్ ఢీషోకు గుడ్ బై చెప్పేశాడని అంటున్నారు.

సుడిగాలి సుధీర్... ఈ పేరు తెలియిని టీవీ ప్రేక్షకులు ఉండరు.ఏ హిట్ చూసినా..అందులో సుధీర్ కనిపిస్తాడు. తన స్కిట్స్‌తో డైలాగ్స్‌తో అందర్నీ అలరిస్తాడు. బుల్లితెరపై తన సత్తా చాటుతున్న నటుల్లో సుడీగాల్ సుధీర్ టాప్ ప్లేసులో నిల్చోన్నాడు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుధీర్.. తనకున్న మల్టీ టాలెంట్స్‌తో అంచెలు అంచెలుగా ఎదిగి.. హీరోగా మారిపోయాడు. సుధీర్ హీరోగా పలు సినిమాల్లో కూడా నటించాడు. సుధీర్ చేస్తున్న ప్రముఖ టీవీ షోల్లో.. జబర్దస్త్,ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ. అయితే గత కొంతకాలంగా సుధీర్ ఢీ షోలో కనిపించడం లేదు. దీంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఢీ షో నుంచి సుధీర్‌ను తప్పించారంటూ కథనాలు వచ్చాయి. సుధీరే కావాలని ఢీ నుంచి వెళ్లిపోయాడంటూ ఇంకొందరు చెప్పుకొచ్చారు. దీంతో రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి.

ఈ క్రమంలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్ ఢీ షోపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ షోలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు జబర్దస్త్ నటులు సమాధానాలు ఇచ్చారు. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్,సుడిగాలి సుధీర్‌ను అభిమానులు పలు ప్రశ్నలు వేశారు. అయితే సుడిగాలి సుధీర్‌ను ప్రశ్నించారు. ‘సుధీర్ అన్న నీ షోను వీకెండ్ వస్తే మేం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మరి నువ్వు ఢీ షో ఎందుకు చేయడం లేదు’ అంటూ అభిమాని అడిగాడు.దీనికి సుధీర్ సమాధానం ఇస్తూ... ‘ఢీషోను నేనెప్పుడు ఆపాను.. కొంచెం పాజ్ ఇచ్చాను.. ఐ విల్ బి బ్యాక్ వెరీ సూన్’ అంటూ సుధీర్ అందరికీ షాక్ ఇచ్చాడు.

మరోవైపు సుధీర్ ఇటు టీవీ షోలు చేస్తూ.. అటు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నాడు. రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. కాలింగ్ సహస్ర అనే సినిమా ఎప్పటి నుంచో లైన్‌లో ఉంది. ఈ సినిమా టీజర్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. కాలింగ్ సహస్ర టీజర్ మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా స్టోరీ ఏంటన్న దానిపై సస్పెన్స్ క్రియేట్ చేసింది. సుధీర్ కెరియర్‌లో ఈసినిమా మంచి విజయం అందుకోవాలంటూ అతడి అభిమానులు జోరుగా కామెంట్లు పెట్టారు. మరోవైపు గాలోడు సినిమాను మాత్రం ముందుగా పూర్తి చేసేందుకు సుధీర్ బిజీగా తిరుగుతున్నాడు.

First published:

Tags: Dhee show, Jabardast, Sudigali sudheer

ఉత్తమ కథలు