హోమ్ /వార్తలు /సినిమా /

Getup Srinu: తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో గెటప్ శ్రీను.. దానిమ్మ పిందెలతో అంటూ?

Getup Srinu: తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో గెటప్ శ్రీను.. దానిమ్మ పిందెలతో అంటూ?

getup srinu

getup srinu

Getup Srinu: జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. జబర్దస్త్ లో కమెడియన్ గా పరిచయమై స్టార్ కమెడియన్ గా నిలిచాడు. తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

  Getup Srinu: జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. జబర్దస్త్ లో కమెడియన్ గా పరిచయమై స్టార్ కమెడియన్ గా నిలిచాడు. తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్క ఎపిసోడ్ లో ప్రతి ఒక్క గెటప్ తో ఎంట్రీ ఇస్తూ గెటప్ శ్రీను గా పేరు సంపాదించుకున్నాడు. వెండితెరపై కూడా నటించి తనేంటో నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే గెటప్ శ్రీను పరిస్థితి తిండిలేక దానిమ్మ పిందెలతో కడుపు నింపుకోవాల్సి వచ్చింది.

  అదేంటి మంచి స్టార్ హోదాలో ఉన్న గెటప్ శ్రీను పరిస్థితి ఇలా మారిందేంటి అనుకుంటున్నారా. అది ఇప్పుడు కాదు లెండి.. తన కెరీర్ మొదట్లో ఎదుర్కున్న కొన్ని అనుభవాలు. నిజానికి చాలా మంది సెలబ్రెటీలు తమ కెరీర్ లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మరి.. తమ గమ్యానికి చేరుకుంటారు. అలాంటిది గెటప్ శ్రీను కూడా తన గమ్యాన్ని కొన్ని అడ్డంకులు ఎదుర్కొని మరి చేరుకున్నాడు. ఈయన జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు అంటే కెరీర్ మొదలు పెట్టక ముందు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట.

  నిజానికి తినడానికి తిండి లేని పరిస్థితి, కడుపు మార్చుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయట. ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా తన సొంత కాళ్ళ మీద బ్రతకడానికి హైదరాబాద్ కి వచ్చిన శ్రీను కొన్ని రోజులు తన పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాడట. ఇక తన పిన్ని తనని ఎంతో ఆప్యాయంగా చూసుకునేదట. కానీ అలా ఎన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోని అక్కడినుంచి వెళ్ళిపోయాడట శ్రీను.

  అలా మ్యాగీ అనే ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాడట. అతడు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ శ్రీనుకి మంచి శ్రేయోభిలాషిగా ఉన్నాడట. ఇక మ్యాగీకి నాగోల్ లో ఓ చిన్న రేకుల షెడ్డు, ఇక తలుపు లేని బాత్రూం ఉండేదట. అలా ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉంటూ.. వారిద్దరు కలిసి మియాపూర్ లో ఉండే మా కేబుల్ కి వెళ్లేవారట. అలా మొదటి ఆరు నెలల వరకు ఇద్దరి దగ్గర సరిగ్గా డబ్బులు ఉండేవి కాకపోవడంతో షో ద్వారా వచ్చిన డబ్బులతో ఒక బ్రెడ్ కొనుక్కొని మంచి నీళ్ళు ముంచుకుని తినేవారట. అలా ఎన్నో పూటలు తిండి మానుకొని ఉండగా అనుకోకుండా ఓ పని పడటంతో మ్యాగీ తన ఊరికి వెళ్ళాడట.

  ఆ సమయంలో శ్రీను అతని దగ్గర డబ్బులు అడగడం మర్చిపోయాడట. ఇక ఓ రోజు ఏం తినాలన్నా రూపాయి లేకపోవడంతో పక్కింట్లో ఉన్న దానిమ్మ చెట్టు కొమ్మలు తమ స్థలంలోకి వంగి ఉండటంతో కాయలను కోసుకొని తిందామని అనుకున్నాడట. కానీ ఎక్కడ కాయలు కనిపించకపోవడంతో పిందెలు మాత్రమే ఉండటంతో ఆకలితో తట్టుకోలేక వాటిని తినేసాడట. అలా తన నోరంతా పుండుగా తయారయ్యి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. అలాంటి అడ్డంకులను ఎదుర్కొని ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాడట గెటప్ శ్రీను.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Actor getup srinu, Extra jabardasth, Jabardasth, Tollywood

  ఉత్తమ కథలు