Jabardast Emmanuel: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ని ఇస్తోంది. ఈ షోలో పాల్గొని చాలా మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. వారిలో కొందరు సినిమాల్లోనూ దూసుకుపోతుండగా.. కొత్త కొత్త టాలెంట్‌కి సైతం ఆ స్టేజ్ వేదికగా మారింది. ఇక ఈ షోలో ఇప్పుడు అందరినీ మెప్పిస్తోన్న కమెడియన్లలో ఇమ్మాన్యుల్ ఒకడు. అవినాష్ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తరువాత కెవ్వు కార్తీక్ టీమ్‌లో కీలక పాత్ర పోషించాడు ఇమ్మాన్యుల్. ఆ సమయంలో కెవ్వు కార్తీక్ వరుసగా హిట్లు కొట్టగా.. ఆ క్రెడిట్ ఎక్కువగా ఇమ్మాన్యుల్కి దక్కింది. అంతేకాదు ఒకానొక సమయంలో ఎక్స్ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ టీమ్‌కి గట్టి పోటీని ఇచ్చాడు ఇమ్ము. ఇప్పుడు కేవలం అవినాష్ టీమ్‌కి మాత్రమే పరిమితం అవ్వకుండా., పలు టీమ్‌లలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు ఈటీవీలో ప్రతి ఆదివారం వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పనోడుగా బాగా ఆకట్టుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే ఈ కమెడియన్‌కు అంత ఫేమ్ రావడానికి మరో కారణం వర్ష. వీరిద్దరి జోడి అభిమానులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లవర్స్‌గా ఈ జోడి మంచి పేరును కూడా సంపాదించుకుంది. ఇక ఈ జోడిని పలు ప్రోగ్రామ్‌లలోనూ వాడుకుంటున్నారు నిర్వాహకులు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రాను రాను వీరిద్దరు రెచ్చిపోయారు. స్క్రిప్ట్‌లో భాగమో లేక నిజంగానో తెలీదు గానీ.. కొన్ని సార్లు అతిగానే నటించారు. దీంతో ఈ జోడిపై కామెంట్లు వచ్చాయి. వర్ష విషయంలో ఇమ్మాన్యుల్ హద్దులు దాటుతున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
దీంతో ఇమ్మాన్యుల్ హర్ట్ అయినట్లు ఉన్నాడు. దీన్ని గత వారం స్కిట్లో చూపించాడు ఇమ్మాన్యుల్. వర్షకు దూరంగా ఉంటూ వచ్చిన ఇమ్మాన్యుల్.. ఆమె దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దగ్గరగా వస్తే నన్ను కామెంట్లలో వేసుకుంటారని అన్నాడు. ఇక నువ్వు నన్ను ముట్టకు అని కూడా ఇమ్మాన్యుల్ అన్నాడు. ఇది చూస్తుంటే ఇమ్మాన్యుల్, వర్ష విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఒక్క ఎపిసోడ్‌కే వర్షను పక్కనపెట్టాడో లేక ఇకపై కూడా ఆమెను దూరంగా పెట్టనున్నాడో చూడాలి.