హోమ్ /వార్తలు /సినిమా /

Hyper Aadi: హైపర్ ఆది నిజస్వరూపం బయట పెట్టిన దొరబాబు భార్య.. ఏకంగా?

Hyper Aadi: హైపర్ ఆది నిజస్వరూపం బయట పెట్టిన దొరబాబు భార్య.. ఏకంగా?

hyper aadhi

hyper aadhi

Hyper Aadi: బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అలా ప్రసారం అయ్యే షోస్ కు సామాన్యులను తీసుకొచ్చి వారిలోని ట్యాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి సెలబ్రెటీలుగా మారుస్తున్నాయ్ కొన్ని షోస్.

Hyper Aadi: బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అలా ప్రసారం అయ్యే షోస్ కు సామాన్యులను తీసుకొచ్చి వారిలోని ట్యాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి సెలబ్రెటీలుగా మారుస్తున్నాయ్ కొన్ని షోస్. ఇప్పటికే ఎన్నో బుల్లితెర షోలలో పాల్గొన్న కంటెస్టెంట్ లు వారి ట్యాలెంట్ తో వెండితెరపై అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. అలా వెండితెరపై మెరిసిన ఎందరో సెలబ్రెటీలు బుల్లితెరపై ప్రసారం అయిన జబర్దస్త్ షో నుంచి వచ్చినవారే!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎనిమిదేళ్లుగా ఈ షో ప్రసారం అవ్వగా.. టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది.. ఇందులో పాల్గొన్న కమెడియన్స్ ప్రస్తుతం వెండితెరపై భారీ స్థాయిలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇందులో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి కమెడియన్స్ ప్రస్తుతం స్టార్ స్థానంలో నిలిచారు. ఇక ఈ కమెడియన్స్ లో హైపర్ ఆది తన హైపర్ పంచులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎదుటి వారిపై పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందిస్తాడు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంచులు పేలుస్తుంటాడు.

అయితే గతంలో హైపర్ ఆది టీంలో పనిచేసే ఇద్దరు కమెడియన్స్ దొరబాబు, పరదేశి వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఆ ఘటన జరిగి సంవత్సరం పూర్తయిన వాళ్ళను ఉద్దేశిస్తూ ఆది వాళ్లపైనే తెగ పంచ్ లు వేస్తుంటాడు. ఇప్పటికీ వాళ్లను టార్గెట్ చేస్తునే ఉంటాడు. ఇక తాజాగా దొరబాబు భార్య ఆది గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఇటీవల కాలంలో మంచి రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ షోలో దొరబాబు తన భార్య అమూల్య పాల్గొన్నారు. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్ దొరబాబుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని అమూల్యను ప్రశ్నించాడు. దీంతో ఆమె తన ఇంట్లో వాళ్ళు దొరలాంటివాడిని పెళ్లి చేసుకోమని చెబితే దొరలాంటివాడు ఎందుకని దొరబాబునే చేసుకున్న అంటూ పంచ్ వేసింది. ఆ డైలాగ్ విన్న వెంటనే ''నీకు ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థం అయింది'' అంటూ హైపర్ అది కౌంటర్ వేసాడు.

ఇక ఆ వెంటనే దొరబాబు భార్య అమూల్య హైపర్ ఆది గురించి మాట్లాడుతూ.. ''మేము కష్టాల్లో ఉన్న సమయంలో.. మాకు ఎవరు లేరు అనుకున్న సమయంలో హైపర్ ఆదినే మమ్మల్ని ఆదుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆది మా వెంట ఉన్నాడు, అందుకే ఆయన నెంబర్ మా ఫోన్ లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నమంటూ అమూల్య కన్నీళ్లు పెట్టుకుంది. హైపర్ ఆదిలో ఈ కోణం కూడా ఉందా అంటూ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

First published:

Tags: God, Hyper Aadi, Jabardast comedian dorababu, Wife amulya

ఉత్తమ కథలు