Rashmi- Sudheer: తెలుగు బుల్లితెరపై హిట్ పెయిర్ ఏంటంటే వెంటనే గుర్తొచ్చే జంట సుధీర్, రష్మి. నిజ జీవితంలో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండిష్ ఉండగా.. బుల్లితెరపై ఈ జంట రొమాన్స్ మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. పెద్ద పెద్ద స్టెప్పులు వేయకపోయినా, డైలాగ్‌లు లేకపోయినా.. స్టేజ్ మీద ఈ జంట ఉందంటే చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ జంట పేరు కనిపిస్తే చాలు ఆ షోలకు టీఆర్పీ రేటింగ్‌లు కూడా మంచిగా ఉంటాయి. అంతేకాదు ఈ ఇద్దరికి ప్రత్యేక అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఇక ఈ జంటకు ఉన్న క్రేజ్‌తో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు చేసేందుకు కూడా పలువురు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు కూడా ఆసక్తిని చూపుతుంటారు. అంతేకాదు వెండితెరపై కూడా వీరిద్దరితో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కుదరలేదు.
కాగా ఇప్పుడు ఈ జంట మధ్యలోకి ఆది ఎంటర్ అయ్యాడు. సుధీర్ ముందరే రష్మికి బిస్కెట్లు వేస్తన్నాడు. సుధీర్ పక్కనే ఉన్నప్పటికీ ఏ మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. ఈటీవీలో ఢీ 13వ సీజన్‌లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ థీమ్‌తో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ సీజన్ నడుస్తోంది. ఇక ఇందులో అబ్బాయిల వైపు మెంటర్లుగా సుధీర్, ఆది ఉండగా.. అమ్మాయిల వైపు రష్మి, దీపిక ఉన్నారు.
ఇక ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో ఆది మాట్లాడుతూ.. ఈ రోజు ఈ సెట్‌లో అందంగా ఎవరైనా ఉన్నారు అంటే అది రష్మినే అని అంటాడు. రష్మి వేసుకున్న కాస్టూమ్ గానీ, హెయిర్ స్టైల్ గానీ, ఆ చెవులకు పెట్టిన బుట్టలు గానీ.. నిజంగా బుట్టబొమ్మగా ఉన్నావని అంటాడు. ఆ సమయంలో సుధీర్ ఎదురుగానే ఉన్నా ఏ మాత్రం పట్టించుకోనట్లుగా ఉన్నాడు. ప్రోమోలో అది మాత్రమే చూపించగా.. దానికి సుధీర్ ఏమైనా రెస్పాండ్ అయ్యాడా..? రష్మి ఎలా రియాక్ట్ అయ్యింది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Rashmi Gautam, Sudigali sudheer, Television News