Jabardast varsha: డ్యాన్స్ చేస్తూ భావోద్వేగానికి గురైన వ‌ర్ష‌.. అస‌లు కార‌ణం ఇదే

Jabardasth varsha Instagram

Jabardast Varsha: జ‌బ‌ర్ద‌స్త్‌లో చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు వ‌ర్ష‌. అంత‌కుముందు ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టించిన వ‌ర్ష జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా బాగా పాపుల‌ర్ అయ్యారు. అందులో ముఖ్యంగా ఇమ్మాన్యుల్‌తో ఎక్కువ‌గా జ‌త క‌డుతుంటుంది వ‌ర్ష‌. ఇక వీరి జోడీకి మంచి క్రేజ్ రావ‌డంతో.. ఇప్పుడు ప‌లు షోల్లోనూ వీరిద్ద‌రు మెరుస్తున్నారు.

  • Share this:
    Jabardast Varsha: జ‌బ‌ర్ద‌స్త్‌లో చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు వ‌ర్ష‌. అంత‌కుముందు ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టించిన వ‌ర్ష జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా బాగా పాపుల‌ర్ అయ్యారు. అందులో ముఖ్యంగా ఇమ్మాన్యుల్‌తో ఎక్కువ‌గా జ‌త క‌డుతుంటుంది వ‌ర్ష‌. ఇక వీరి జోడీకి మంచి క్రేజ్ రావ‌డంతో.. ఇప్పుడు ప‌లు షోల్లోనూ వీరిద్ద‌రు మెరుస్తున్నారు. అయితే జ‌బ‌ర్ద‌స్త్‌తో పాటు ఈటీవీలో ప్ర‌తి ఆదివారం ప్ర‌సార‌మయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో వ‌ర్ష క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఇమ్మాన్యుల్ కూడా ప‌నిమ‌నిషి పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. ఒక్కో ప్ర‌దేశానికి వెళ్లి అక్క‌డి టాలెంట్‌ని ప‌రిచ‌యం చేయ‌డంతో పాటు ఈటీవీ ఆర్టిస్ట్‌ల‌తోనూ ఇందులో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇప్పిస్తున్నారు. అలాగే ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో సెల‌బ్రిటీ ఈ షోలో సంద‌డి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఆదివారం ప్ర‌సారం కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన వీడియో తాజాగా విడుద‌ల అయ్యింది.

    దానికి ప్ర‌ముఖ న‌టుడు స‌మీర్ అతిథిగా వ‌చ్చాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ వ‌ర్ష డ్యాన్స్ చేయ‌నుంది. నాన్న మీద ఆమె డ్యాన్స్ చేయ‌బోతోంది. అయితే ఆ పాట‌లో చాలా లీన‌మైపోయింది వ‌ర్ష‌. కింద ప‌డిన‌ప్ప‌టికీ భావోద్వేగంతో ఆమె డ్యాన్స్ చేసింది. ఇక ఆ ఫర్ఫామెన్స్ త‌రువాత త‌న తండ్రి రీసెంట్‌గా చ‌నిపోయార‌ని వ‌ర్ష ఎమోష‌న‌ల్ అవుతుంది. ఇక వ‌ర్ష ఆ మాట చెప్పే స‌మ‌యంలో ఈ షోకు వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సింగ‌ర్ రేవంత్.. తాను క‌డుపులో ఉన్న‌ప్పుడే త‌న తండ్రి చ‌నిపోయాడ‌ని భావోద్వేగానికి గురి అవుతాడు.


    మ‌రోవైపు ఈ షోలో శ్రీదేవిని చూపిస్తామంటూ మ‌రో ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చారు. ఆమె ముసుగును తొల‌గించే స‌మ‌యంలో న‌రేష్ వ‌న్ సెక‌న్ అంటూ ఓంకార్‌ని ఇమిటేట్ చేయ‌డం.. అక్క‌డున్న అంద‌రూ ఆమెను చూసేందుకు ఎదురుచూస్తూ ఉండ‌టం.. ప‌దే ప‌దే న‌రేష్ వ‌న్ సెక‌న్ అంటుంటే ఇమ్మాన్యుల్ కామెంట్ చేయ‌డం.. ఇలా ఫ‌న్నీగా ఈ ప్రోమో వ‌చ్చింది. మొత్తానికి వ‌చ్చే వారం కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీలో మ‌రింత ఫ‌న్ ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.
    Published by:Manjula S
    First published: