Rashmi Gautam: సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలకు మంచి డిమాండ్ ఉంటుంది. చాలా ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తూ వస్తుండగా.. దానిపై కోట్లలో బెట్టింగ్ కూడా జరుగుతుంటుంది. అయితే మూగ జీవాలను హింసించడం పాపమంటూ ఈ కోడి పందేలపై ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ సమయంలో అటు సంప్రదాయాలను పాటించే వారి మనోభావాలు దెబ్బతీయకుండా, ఇటు మూగ జీవాల గురించి ఆలోచిస్తూ.. తీర్పును ఇచ్చేందుకు న్యాయస్థానాలు కూడా తర్జనభర్జన పడుతుంటాయి. అయితే ఇదొక్కటే కాదు.. తమిళనాడులో జరిగే జల్లికట్టు సంప్రదాయానికి కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతుంటాయి. ఇదంతా పక్కనపెడితే సెలబ్రిటీల్లో కొంతమంది వీటికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూ ఉంటారు. వారిలో యాంకర్ రష్మి ఒకరు. మూగ జీవాలను హింసించడం పాపమంటూ మొదటి నుంచి అందరిలో అవేర్‌నెస్ ఇస్తూ వస్తోన్న రష్మి.. తాజాగా కోడి పందేలపై స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కోడి పందేలకు వ్యతిరేకమని అన్నారు. అది చట్టబద్దం కాదని, మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక మూగజీవిని అలా హింసించకూడదని రష్మి తెలిపింది. కంట్లో కారం పెట్టి, వాటిని ఇబ్బంది పెట్టడం చాలా తప్పని, అస్సలు అది మానవత్వం అనిపించుకోదని ఆమె వివరించారు. ఏ దేవుడు అలా కోరుకోడని ఆమె స్పష్టం చేశారు.
ఇక తన స్టేట్‌మెంట్ వలన చాలా మంది హర్ట్ అవ్వొచ్చని.. వారు ఎలా అనుకున్నా ఇబ్బంది లేదని, కానీ తాను మాత్రం వాటికి వ్యతిరేకతమని వివరించారు. ఒక మూగ జీవిని ఇబ్బంది పెట్టి, దాని వల్ల మనం ఎంటర్‌టైన్‌మెంట్ పొందడం చాలా చాలా తప్పు అది మనం చేయకూడదని పేర్కొన్నారు. తనను కూడా ఆ పందేలు జరిగే ప్రదేశానికి తీసుకెళ్లాలని చాలా మంది చూశారని... కానీ వారికి నేను క్లియర్‌గా చెప్పానని వివరించారు.
ఇలా చేసే వాళ్ల కంటే చూసేవాళ్లదే పెద్ద తప్పు అని రష్మి చెప్పుకొచ్చారు. తన వృత్తి కోసం ఒక వ్యక్తి జంతువులను చంపడం తప్పు కాదని.. కానీ తినేవాళ్లదే తప్పు అని ఈ జబర్దస్త్ యాంకర్ వివరించారు. అందుకే వాటిని నేను ఎంకరేజ్ చేయనని రష్మి స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Anchor rashmi gautam, Jabardasth rashmi, Rashmi Gautam