Home /News /movies /

JABARDAST ANCHOR RASHMI GAUTAM DEBUT AS HEROINE IN TAMIL MOVIE HERE IS THE DETAILS HOW SHE GOT THAT OFFER MNJ

Rashmi Gautam: ర‌ష్మి గౌత‌మ్‌కి హీరోయిన్‌గా మొద‌టి ఛాన్స్ రావ‌డానికి కారణం ఆ న‌టే

Rashmi gautam Instagram

Rashmi gautam Instagram

Rashmi Gautam: తెలుగు బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ ర‌ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.అంత‌కుముందు ప‌లు సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించిన ర‌ష్మి.. జ‌బ‌ర్ద‌స్త్‌కి వ‌చ్చిన త‌రువాత ప్ర‌త్యేక ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు.

ఇంకా చదవండి ...
    Rashmi Gautam: తెలుగు బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ ర‌ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.అంత‌కుముందు ప‌లు సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించిన ర‌ష్మి.. జ‌బ‌ర్ద‌స్త్‌కి వ‌చ్చిన త‌రువాత ప్ర‌త్యేక ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. ఇక మొద‌ట్లో చిన్న చిన్న బ‌ట్ట‌లు వేసుకుంటూ తెలుగు కూడా స‌రిగా మాట్లాడ‌లేక‌పోయిన ఈ యాంక‌ర్.. రాను రాను త‌న‌ను తాను చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వ‌చ్చింది. ఇక ఇప్పుడు ర‌ష్మికి సినిమాల్లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కాగా చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించిన ఈ బ్యూటీకి హీరోయిన్‌గా మొద‌టి అవ‌కాశం ఎలా వ‌చ్చింది.. దాని వెనుక ఉన్న నటి ఎవరు.. ఆమె వ‌ల‌న ర‌ష్మి హీరోయిన్‌గా ఏ భాష‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..

    ఆ వివ‌రాల్లోకి వెళితే.. హోళీ చిత్రంతో ఒక పాత్ర ద్వారా వెండితెర‌పైకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మి ఆ త‌రువాత ప్ర‌స్థానం, ఎవ‌రైనా ఎపుడైనా, గ‌ణేష్ జ‌స్ట్ గ‌ణేష్, బిందాస్, క‌రెంట్ ఇలా ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో మెరిశారు. కందేన్ అనే త‌మిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ ఆఫ‌ర్ రావ‌డానికి కార‌ణం న‌టి సంగీత‌. తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించి ఇక్క‌డ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న సంగీత ఒక రియాలిటీ షోలో ర‌ష్మిని గుర్తించారు. ఆ త‌రువాత ఈ యాంక‌ర్ గురించి త‌మిళ డైరెక్ట‌ర్ ముగిల్‌కి చెప్పారు.

    అత‌డు త‌న కందేన్ చిత్రంలో హీరోయిన్‌గా ర‌ష్మిని ఎంపిక చేసుకున్నాడు. శాంత‌నూ భాగ్య‌రాజ్, సంతానం, ర‌ష్మి ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. ఇందులో ర‌ష్మికి మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే ఆమెకు మాత్రం అక్క‌డ పెద్ద‌గా అవ‌కాశాల‌ను తీసుకురాలేక‌పోయాయి. ఇటు తెలుగులోనూ ప‌లు చిత్రాల్లో ర‌ష్మి హీరోయిన్‌గా న‌టించింది. అయితే అవి కూడా ఆమెకు ఊహించిన విజ‌యాన్ని అందివ్వ‌లేక‌పోయాయి. ఇక ఇప్పుడు నందుతో క‌లిసి బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Anchor rashmi gautam, Rashmi Gautam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు