Rashmi Gautam: ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళల ఔన్నత్యాన్ని చాటుతూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. తమ జీవితంలోని మహిళల గొప్పదనాన్ని చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఒకరోజు మాత్రమే మహిళలకు గౌరవం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వారిపై దారుణాలకు ఒడిగడుతూ, వారిని కించపరుస్తూ, అవమానపరుస్తూ ఇప్పుడు ఒక రోజును వారికి కేటాయిస్తున్నారా.. ఈ రోజును సెలబ్రేట్ చేసుకోమని చెబుతున్నారా అంటూ తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా విమెన్స్ డేపై సంచలన కామెంట్లు చేశారు. ఆ మార్పులు జరిగినంతవరకు నాకు విమెన్స్ డే వద్దని తెగేసి చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మహిళను కొడుతూ ఉన్న వీడియోను షేర్ చేసి.. కామెంట్ పెట్టారు.
అందులో ఈ మార్పు జరిగే వరకు నాకు విమెన్స్ డే వద్దు. ఒక పురుషుడు బహిరంగంగా మహిళలను కించపరుస్తూ, ఆమెను అసభ్యపదజాలతంతో దూషిస్తూ, ఆమెపై చెప్పులు విసురుతున్నాడు. ఇదంతా ఆమె తల్లిదండ్రుల ముందే చేస్తున్నాడు. ఈ ఘటన బాధాకరం. ఈ రోజు కూడా అన్ని రోజుల్లా ఒక రోజు మాత్రమే. స్త్రీ తత్వం కాదు. మానవత్వాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అందరినీ సమానంగా చూద్దాం. మనముందున్న సమస్యలను పరిష్కరించుకుందాం అని కామెంట్ పెట్టారు.
కాగా సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు రష్మి. అలాగే మూగ జీవాలపై కూడా ఆమె ప్రేమను చూపుతుంటారు. మానవత్వాన్ని చాటాలంటూ గతంలోనూ రష్మి పలుమార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.