Sudheer- Rashmi: తెలుగు బుల్లితెరపై రొమాంటిక్ కపుల్ అనగానే.. సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ పేర్లు అందరికీ గుర్తొస్తాయి. బుల్లితెరపై వారిద్దరిని షారూక్- కాజల్ జోడీగా చాలా మంది అభివర్ణిస్తూ ఉంటారు. వాళ్లు కనిపిస్తే చాలు టిఆర్పీ రేటింగ్స్ కూడా పరుగులు తీస్తూ వస్తుంటాయి. అందుకే వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీ కూడా వీరిద్దరితో ఇప్పటికే చాలా షోలు చేసి విజయం సాధించింది. అలాగే వీరిద్దరిపై కూడా చాలా మంది కమెడియన్లు స్కిట్లు చేసి విజయం సాధించారు. అంతేనా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే షోలు, ప్రోగామ్‌లను పక్కనపెడితే.. తామిద్దరం మంచి స్నేహితులమని వీరు ఇప్పటికే చాలా సార్లు చెబుతూ వచ్చినప్పటికీ.. వీక్షకులకు మాత్రం ఈ ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక రష్మిని తన లక్కీ పర్సన్‌గా చెప్పుకొనే సుధీర్.. ఆమెపై చాలాసార్లే ప్రేమను చూపించాడు.
ఇదంతా పక్కనపెడితే స్కిట్ చేసే సమయంలోనూ వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగుతుంటుంది. సుధీర్‌కి ఏదొక పంచ్ వేస్తూనే ఉంటుంది రష్మి. అది చూసే వారికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక రష్మి వేసే పంచ్‌లకు సుధీర్ కూడా నవ్వుతుంటాడు. ఈ క్రమంలో తాజాగా అతడికి కౌంటర్ ఇచ్చింది రష్మి.
ఈటీవీలో ప్రసారం అవుతున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో సుధీర్‌కి బేబి పుట్టినట్లు చూపించారు. అంతకుముందు ఒక ఎపిసోడ్‌లో సుధీర్‌కి గర్భం వచ్చినట్లు, సీమంతం చేసినట్లు చూపించగా.. ఈసారి బేబి పుట్టినట్లు చూపించారు. ఇక ఆ బేబిని ఏడుపు ఆపేందుకు పాట పాడమని ఆటో రామ్ ప్రసాద్ చెప్పగా.. అడిగా అడిగా అని సుధీర్ పాట పాడుతుంటాడు. దానికి రష్మి.. అలా అందరినీ అడిగావు కాబట్టే ఇలా జరిగింది అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ ఎపిసోడ్‌కు హీరో సందీప్ కిషన్, లావణ్య గెస్ట్‌లుగా రానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.