Sudheer- Rashmi: తెలుగు బుల్లితెరపై హిట్ పెయిర్ ఏంటంటే వెంటనే గుర్తొచ్చే జంట సుధీర్, రష్మి. నిజ జీవితంలో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండిష్ ఉండగా.. బుల్లితెరపై ఈ జంట రొమాన్స్ మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. పెద్ద పెద్ద స్టెప్పులు వేయకపోయినా, డైలాగ్‌లు లేకపోయినా.. స్టేజ్ మీద ఈ జంట ఉందంటే చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ జంట పేరు కనిపిస్తే చాలు ఆ షోలకు టీఆర్పీ రేటింగ్‌లు కూడా మంచిగా ఉంటాయి. అంతేకాదు ఈ ఇద్దరికి ప్రత్యేక అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఇక ఈ జంటకు ఉన్న క్రేజ్‌తో ప్రత్యేక ప్రోగ్రామ్‌లు చేసేందుకు కూడా పలువురు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు కూడా ఆసక్తిని చూపుతుంటారు. అంతేకాదు వెండితెరపై కూడా వీరిద్దరితో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఇప్పటికీ కుదరలేదు.
ఇదిలా ఉంటే సుధీర్‌తో సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలోనూ రష్మికి ఓ ప్రశ్న ఎదురైంది. మీ ఇద్దరిది హిట్ పెయిర్ కదా.. మీ ఇద్దరి కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా మంది ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఈ సంవత్సరమైనా నెరవేరుతుందా..? అని రష్మిని ప్రశ్నించగా.. అన్నీ కుదిరితే జరగొచ్చు అని రష్మి అన్నారు.
సుధీర్‌తో సినిమాలో నటించేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నా. మేము ఇక్కడ ఉన్నది అందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి.. మా ఫ్యాన్స్ మా నుంచి సినిమా కోరుకుంటున్నారు అంటే మేము కచ్చితంగా ప్రయత్నిస్తాము. ఇప్పటికి మమ్మల్ని చాలా మంది నిర్మాతలు కలిశారు. నేను, సుధీర్ కూడా స్క్రిప్ట్‌లు వింటున్నాము. స్క్రిప్ట్ నచ్చితే కచ్చితంగా నటిస్తాము అని రష్మి స్పష్టం చేసింది. ఇక సుధీర్‌తో పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఇప్పట్లో తనకైతే పెళ్లి అలోచలు లేవని అన్నారు. ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా ముందుకు వెళ్తున్నానని అందుకే పెళ్లి గురించి ఆలోచనలు ఏవీ పెట్టుకోలేదని తెలిపారు.
ఇక సుధీర్, రష్మి పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని.. అలాగే షో ఏదైనా సరే అందులో రష్మి, సుధీర్ ఇద్దరు కలిసి చేయాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారని అడగ్గా.. వాళ్లు చాలా అనుకుంటారు. కానీ మేమిద్దరమే అన్నీ షోలు చేయాలనుకుంటే కుదరదు కదా స్పష్టతను ఇచ్చారు రష్మి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Anchor rashmi gautam, Jabardasth rashmi, Sudigali sudheer