హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇకపై ఆ పని చేయనంటున్న జబర్ధస్త్ యాంకర్

Anasuya: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇకపై ఆ పని చేయనంటున్న జబర్ధస్త్ యాంకర్

అనసూయ భరద్వాజ్(anasuya Instagram)

అనసూయ భరద్వాజ్(anasuya Instagram)

Anchor Anasuya: హాట్ యాంకర్ అనసూయ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్. ఈ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక‌పై ఆ ప‌ని చేయ‌నంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోన‌వుతున్నారు. అయితే అన‌సూయ తీసుకున్న ఆ కీల‌క నిర్ణ‌యం ఏంటంటే..

ఇంకా చదవండి ...

  Anchor Anasuya: హాట్ యాంకర్ అనసూయ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్. ఈ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక‌పై ఆ ప‌ని చేయ‌నంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోన‌వుతున్నారు. అయితే అన‌సూయ తీసుకున్న ఆ కీల‌క నిర్ణ‌యం ఏంటంటే.. ఇక‌పై స్పెష‌ల్ సాంగ్‌ల‌లో ఆమె న‌టించ‌ర‌ట‌. ప్ర‌స్తుతం ఓ వైపు బుల్లితెర‌పై దూసుకుపోతూనే మ‌రోవైపు సినిమాల్లోనూ అన‌సూయ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇలా బిజీ బిజీగా గ‌డిపేస్తోన్న అన‌సూయ‌.. నాలుగేళ్ల క్రితం వ‌చ్చిన విన్న‌ర్ సినిమాలో సూయ సూయ సూయ అనసూయ అనే స్పెష‌ల్ సాంగ్‌లో మెరిశారు. ఆ త‌రువాత ఇప్పుడు కార్తికేయ న‌టిస్తోన్న చావు క‌బురు చ‌ల్ల‌గా మూవీలో మ‌రోసారి స్పెష‌ల్ సాంగ్‌తో మెప్పించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఈ సాంగ్‌కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.

  అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో.. మీరూ భ‌విష్య‌త్‌లోనూ స్పెష‌ల్ సాంగ్‌ల‌లో న‌టిస్తారా అన్న ప్ర‌శ్న‌కు.. ఇక‌పై చేయ‌న‌ని చెప్పేసింది. చావు క‌బురు చ‌ల్ల‌గాలో తాను చేసిన స్పెష‌ల్ సాంగ్‌ని జానీ మాస్టర్ కొరియోగ్ర‌ఫీ చేశార‌ని.. ఆయ‌న త‌న స్నేహితుడు కాబ‌ట్టి అడిగినందుకు చేశాన‌ని అన‌సూయ తెలిపారు. ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో మాత్రమే న‌టిస్తాన‌ని ఆమె అన్నారు.

  కాగా అన‌సూయ న‌టించిన థ్యాంక్యు బ్ర‌ద‌ర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇక కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న రంగ మార్తాండ‌లో అన‌సూయ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. వీటితో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తోన్న సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అలాగే తమిళ్‌లో విజ‌య్ సేతుప‌తి ప‌క్క‌న న‌టించే అవ‌కాశాన్ని ఈ బ్యూటీ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి సినిమాల్లో అన‌సూయ బిజీగా మార‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Anasuya, Anasuya Bharadwaj, Anchor anasuya

  ఉత్తమ కథలు