Home /News /movies /

JABARADASTH COMEDIAN VARSHA TESTED POSITIVE FOR CORONA VIRUS SHE EXPLAINS ABOUT CURRENT SITUATION IN COVID HOSPITAL SK

Jabardasth Varsha: జబర్దస్త్ బ్యూటీకి కరోనా పాజిటివ్.. శవాలను మూటగట్టి విసిరేస్తున్నారని ఆవేదన

jabardasth varsha

jabardasth varsha

ఇటీవల స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకుంది. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఆస్పత్రుల్లో భయానక వాతావరణం ఉందని..దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది వర్ష.

    భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తుఫాన్‌ల విరుచుకుపడుతోంది. రోజువారి పాజిటివ్ కేసులు 3లక్షలకు చేరుతున్నాయి. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇన్ని కేసులు లేవు. పరిస్థితులు చాలా భయకరంగా ఉన్నాయి. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా జబర్దస్త్ వర్ష కూడా కరోనా బారినపడింది. ఇటీవల స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకుంది. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఆస్పత్రుల్లో భయానక వాతావరణం ఉందని..దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది వర్ష.

    ''రెండు రోజుల నుంచి అనారోగ్యంగా ఉంది. కరోనా టెస్టు‌లు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ జరిగేవి బయట ఎవరికీ తెలియదు. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా మందికి టెన్షన్ వస్తుంది. భయపడిపోతారు. మరణించిన వారిని ప్యాక్ చేసి విసిరేస్తున్నారు. అందుకే లైవ్‌కు వచ్చిచెబుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండాలి.'' అని పేర్కొంది జబర్దస్త్ వర్ష.



    వర్షకు కరోనా పాజిటివ్ రావడంతో.. జబర్దస్త్ నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. వర్ష పలు టీమ్‌లలో కంటెస్టంట్‌గా ఉంది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్‌, వర్ష జంట తమదైన శైలిలో కామెడీ చేసి నవ్వుల వర్షం కురిపిస్తారు. ప్రతి స్కిట్‌లోనూ వీరిద్దరు కలిసే చేస్తారు. ఈ జంటకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వర్షకు కరోనా సోకడంతో ఆమెను కలిసిన వారిలో ఆందోళన నెలకొంది. వారంతా ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి. ఒకవేళ జబర్దస్త్‌లో మరికొందరికి కూడా కరోనా పాజిటివ్ వస్తే మాత్రం.. షోపై తప్పకుండా ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jabardasth, Jabardasth Varsha, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు