హైపర్ ఆది,అనసూయ జబర్దస్త్ నుంచి జంప్ అయ్యారా? అసలు సంగతి చెప్పిన అదిరే అభి
Adire Abhi clarity on Jabardasth issue : ఒకరిద్దరు షోని వీడినంత మాత్రాన.. జబర్దస్త్ ఆగిపోదని.. ఇంతకుముందు లాగే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అదే టీఆర్పీ తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బయటకు వెళ్లినవారికి వ్యక్తిగత కారణాలు ఉండవచ్చునని.. దానిపై తానేమీ మాట్లాడలేనని అన్నారు.
news18-telugu
Updated: November 21, 2019, 9:32 AM IST

జబర్దస్త్ నటులు అదిరే అభి,హైపర్ ఆది (File Photos)
- News18 Telugu
- Last Updated: November 21, 2019, 9:32 AM IST
బుల్లితెరపై నవ్వుల గిలిగింతలు పెట్టి ప్రేక్షకుల మనసు దోచుకున్న 'జబర్దస్త్' కామెడీ షో చుట్టూ కొంతకాలంగా సీరియస్ చర్చ జరుగుతోంది.జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. ఆ ప్లాట్‌ఫామ్ ద్వారా తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది నటులు,యాంకర్స్ షోని వీడుతున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ జడ్జి నాగబాబు షో నుంచి వెళ్లిపోయారని ఇప్పటికే క్లారిటీ వచ్చినా.. ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తున్నారన్నది స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ నటుడు అదిరే అభి పలు ఊహాగానాలకు తెరదించుతూ కొంత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
జబర్దస్త్ షో నుంచి హైపర్ ఆది వెళ్లిపోతున్నాడన్న ప్రచారాన్ని అదిరే అభి ఖండించారు. తనకు తమ్ముడి లాంటివాడైన ఆది.. జబర్దస్త్‌ను వీడట్లేదని స్పష్టతనిచ్చారు. ఆది జబర్దస్త్‌లోనే ఉన్నాడని.. ఇకముందు కూడా కొనసాగబోతున్నాడని తెలిపారు. అలాగే యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్‌ను వీడుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆమె కూడా షోలో కొనసాగుతారని చెప్పారు. ఒకరిద్దరు షోని వీడినంత మాత్రాన.. జబర్దస్త్ ఆగిపోదని.. ఇంతకుముందు లాగే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అదే టీఆర్పీ తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బయటకు వెళ్లినవారికి వ్యక్తిగత కారణాలు ఉండవచ్చునని.. దానిపై తానేమీ మాట్లాడలేనని అన్నారు. ఇక నాగబాబు షో నుంచి వెళ్లిపోవడంపై తాను స్పందించలేనని.. ఆయనపై కామెంట్ చేసేంత స్థాయి తనకు లేదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా జబర్దస్త్ తమకు తిండి పెట్టి.. ఒక గుర్తింపునిచ్చిందని గుర్తుచేశారు.జబర్దస్త్ నటుల్లో వివాదాలు తలెత్తాయన్న ప్రచారాన్ని అభి తప్పు పట్టారు. అలాంటిదేమీ లేదని.. ఎక్కడున్నా.. ఏం చేసినా.. తామంతా కలిసే ఉంటామని తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఇంట్లో విషాదం...
బీజేపీలో చేరికపై డీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు... కేసీఆర్‌పై సెటైర్
RRR కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
షెర్లిన్ చోప్రాకు వర్మ సెక్స్ వీడియో.. అసలు విషయం బయటపెట్టిన కామసూత్ర నటి
చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు.. మునిగిన రివర్ వ్యూ భవనం
టీఆర్ఎస్కు ఎంపీ షాక్.. అమిత్ షాతో భేటీ
Loading...