బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం..

హృతిక్ రోషన్ (పైల్ ఫోటో)

Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తాత జె ఓమ్ ప్రకాష్ తీవ్ర అస్వస్థతతో  ఈ రోజు ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని హృతిక్ ఫ్యామిలీ మెంబర్స్ కన్ఫామ్ చేసారు.

 • Share this:
  బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తాత జె ఓమ్ ప్రకాష్ తీవ్ర అస్వస్థతతో  ఈ రోజు ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని హృతిక్ ఫ్యామిలీ మెంబర్స్ కన్ఫామ్ చేసారు. హృతిక్ రోషన్ తాత.. జె ఓమ్ ప్రకాష్ బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా దర్శకుడిగా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చాలా చిత్రాలు ఏ అక్షరంతో ప్రారంభం కావడం విశేషం. ఆయన  నిర్మాణంలో 1960వ దశకం నుంచి 80 దశకం మధ్యవరకు ఆయన నిర్మాణంలో పలు హిట్ చిత్రాలు తెరకెక్కాయి. అందులో  ‘ఆప్ కీ కసమ్’, ఆహిర్ క్యోన్’ అర్పన్, ఆయే మిలన్ కీ బేలా, ఆయే దిన్ బహార్ కే’, అప్నా బనాలో’, ఆషా,అప్నాపన్, అనే చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఓమ్ ప్రకాష్ నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా పలు చిత్రాను డైరెక్ట్ చేసారు. ఈయన రాజేష్ ఖన్నా హీరోగా ‘ఆప్ కీ కసమ్’ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు అప్పటి బాలీవుడ్ అగ్ర హీరో జితేంద్రతో కూడా పలు హిట్ చిత్రాలను నిర్మించారు.

  j om prakash filmmaker and hrithik roshans grandfather passes away aged 93 yerars,hrithik roshans grandfather j om prakash passes away,hrithik roshan grand father j om prakash died,hrithik roshan,hrithik roshan movies,hrithik roshan songs,hrithik roshan j om prakash,hrithik roshan family,hrithik roshan real life,hrithik roshan dance,hrithik roshan full movie,hrithik roshan workout in gym,hrihtik roshan grandfather demise,hritik roshan,hrithik maternal grandfather demise,rakesh roshan,hrithik roshan interview,hrithik roshan dance performance,hrithik roshan in dhoom 4,hrithik roshan house,rakesh roshan,bollywood,hindi cinema,హృతిక్ రోషన్,హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం,హృతిక్ రోషన్ తాతా జె ఓమ్ ప్రకాష్ కన్నుమూత,హృతిక్ రోషన్ తాత హృతిక్ రోషన్ కన్నుమూత,
  హృతిక్ రోషన్ తాత ఓమ్ ప్రకాష్ (పైల్ ఫోటో)


  1995 నుంచి 1996 వరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేసారు. ఇక ఓమ్ ప్రకాష్ కొడుకు రాకేష్ రోషన్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణించారు. మరో కొడుకు రాజేష్ రోషన్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్‌లో తమ కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకున్నారు. తండ్రికి ఏ అక్షరం ఎలా సెంటిమెంట్ ఎలా ఉందో రాకేష్ రోషన్‌కు ‘ కే’ అక్షరంతో ఎక్కువగా సినిమాలు తెరకెక్కించారు. అందులో ‘కాలా బజార్’,‘కామ్ చోర్’,‘కరణ్ అర్జున్’, ‘కోయిలా’ ‘కహో నా ప్యార్ హై’, క్రిష్,‘కోయి మిల్ గయా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయా సినిమాలకు ఆయన సోదరుడే రాజేష్ రోషనే సంగీతం అందించారు. ఇక హృతిక్ రోషన్ హీరోగా సక్సెస్ అందుకున్న చిత్రాలు కూడా తండ్రి రాజేష్ రోషన్ దర్శక నిర్మాణంలో తెరకెక్కినవే. ఇక హృతిక్ రోషన్ తన తాత కన్నుమూయడంతో ఆయన 92వ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేసాడు. ఆయన తనలో ఉన్న బలహీనతలను అధిగమించి ముందుకు నడిచేలా నన్ను ప్రోత్సహించారు అంటూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మరోవైపు హృతిక్ రోషన్ తాతా కన్నుమూయడంపై పలు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.
  First published: