Venkatesh Drishyam 2: ఇట్స్ అఫీషియల్.. ‘దృశ్యం 2’ రీమేక్‌లో వెంకటేష్ కన్ఫర్మ్..

వెంకటేష్ మోహన్ లాల్ (venkatesh mohanlal)

Venkatesh Drishyam 2: దృశ్యం 2 సినిమా విడుదలై సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయినా కూడా రిస్క్ తీసుకోవడం యిష్టం లేని కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఓటిటిలోనే విడుదల చేస్తున్నారు.

  • Share this:
దృశ్యం 2 సినిమా విడుదలై సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయినా కూడా రిస్క్ తీసుకోవడం యిష్టం లేని కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఓటిటిలోనే విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దృశ్యం 2 సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ నటించిన సినిమాను నేరుగా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసారు. ఈ సినిమాకు భారీగానే ఆఫర్ ఇచ్చింది అమెజాన్. దీనికి వ్యూస్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 2 సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మోహన్ లాల్, మీనా మరోసారి మాయ చేసారంటూ ప్రశంసలు వస్తున్నాయి. తొలిభాగంలో తమ కుటుంబం కోసం ఓ కుర్రాడిని చంపి.. చంపలేదని నాటకం ఆడతారు మోహన్ లాల్ కుటుంబం. రెండో భాగంలో ఆ శవాన్ని బయటికి తీసి అక్కడ్నుంచి కథ మొదలు పెట్టాడు దర్శకుడు జీతూ. కేసును మళ్లీ ఓపెన్ చేసి.. అసలేం జరిగింది.. ఎందుకు చంపాడు అనేది ధర్యాప్తు మొదలవుతుంది. దాన్ని కూడా ఎంతో ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు జీతూ. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే మోహన్ లాల్‌కు తెలుగులో మార్కెట్ పెరగడంతో ఈ సినిమాను ఇక్కడ డబ్బింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం లేదని ఇప్పుడు తేలిపోయింది.

venkatesh drishyam 2,venkatesh drishyam 2 remake,venkatesh drishyam 2 telugu remake,mohanlal venkatesh drishyam 2,venkatesh drishyam 2 jeethu joseph,venkatesh confirmed drishyam 2 remake,telugu cinema,దృశ్యం 2,దృశ్యం 2 తెలుగు రీమేక్,వెంకటేష్ దృశ్యం 2 తెలుగు రీమేక్
దృశ్యం 2 సినిమా (Drishyam 2)


దృశ్యం 2 సినిమా చేస్తున్నట్లు వెంకటేష్ ప్రకటించాడు. తానే హీరోగా నటించబోతున్నట్లు చెప్పేసాడు. తొలి భాగాన్ని తెలుగులో నటి శ్రీ ప్రియ తెరకెక్కించింది. అయితే రెండో భాగాన్ని మాత్రం ఒరిజినల్ డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగులోనూ తెరకెక్కించబోతున్నాడు. వెంకటేష్ హోమ్ బ్యానర్‌లోనే ఈ సినిమా రానుంది. సురేష్ బాబు దృశ్యం 2 సినిమాను నిర్మించబోతున్నాడు.

ప్రస్తుతం నారప్పతో పాటు ఎఫ్ 3 సినిమాలతో బిజీగా ఉన్న వెంకటేష్.. మార్చ్ నుంచి దృశ్యం 2పై ఫోకస్ చేయనున్నాడు. మలయాళంలో దృశ్యం 2 షూటింగ్ 46 రోజుల్లోనే పూర్తి చేసాడు జీతూ జోసెఫ్. మరి తెలుగులో ఈ సినిమాను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: