అవును నిజమే... రష్మిక ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది!

రష్మిక- రక్షిత్ శెట్టి నిశ్చితార్థం రద్దు నిజమేనని వెల్లడించిన రష్మిక తల్లి... విజయ్ దేవరకొండే కారణమంటున్న సినీ జనాలు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 11, 2018, 9:27 PM IST
అవును నిజమే... రష్మిక ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది!
రష్మిక- రక్షిత్ శెట్టి నిశ్చితార్థం రద్దు నిజమేనని వెల్లడించిన రష్మిక తల్లి... విజయ్ దేవరకొండే కారణమంటున్న సినీ జనాలు!
  • Share this:
అవును... హీరోయిన్ రష్మిక మందానా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఇన్నాళ్లూ అవునా...కాదా? అనే కన్ఫర్మేషన్ లేకపోయినా రష్మిక- రక్షిత్ ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఎట్టకేలకు ఈ వార్తలు నిజమేనని రష్మిక తల్లి సుమన్ నిర్ధారణ ఇచ్చేసింది. అయితే రష్మిక ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ కావడం వెనక టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గీత ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకోవడానికి ముఖ్య కారణం గోవిందమేనట.

నాగశౌర్య తొలిసారి నిర్మించి, నటించిన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ హీరోయిన్ రష్మిక మందన. అయితే రెండేళ్ల క్రితమే కన్నడలో ‘కిర్రిక్ పార్టీ’ ఆమె మొదటి సినిమా. ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి, అప్పుడే ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకుంది రష్మిక. ఆ సినిమా తర్వాత ‘అంజనీ పుత్ర’, ‘ఛమక్’ అనే మరో రెండు సినిమాల్లో నటించింది రష్మిక. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ‘ఛలో’ సినిమా ఘనవిజయం సాధించడంలో రష్మిక పాత్ర కూడా చాలా ఉంది. క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్‌తో యూత్‌కు బాగా దగ్గరైంది రష్మిక.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీత గోవిందం’ సినిమా చేసింది రష్మిక. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌లోనూ ఆకట్టుకుంది రష్మిక. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్- రష్మిక మధ్య కెమిస్ట్రీ సూపర్బ్. సినిమా విడుదలకు ముందే ట్విట్టర్‌లో రొమాంటిక్ ఛాట్ చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు రష్మిక- విజయ్ దేవరకొండ. అయితే ఈ చిత్ర సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం నడించిందని, విజయ్ యాటిట్యూడ్‌కి పడిపోయిన రష్మిక రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో రష్మికనే హీరోయిన్‌గా ఎంచుకోవడం గమనార్హం.

కొన్నాళ్లుగా నిశ్చితార్థం రద్దైనట్టు వార్తలు వస్తున్నప్పటికీ హీరోయిన్ రష్మిక గానీ, హీరో రక్షిత్ శెట్టి గానీ స్పందించలేదు. తాజాగా రష్మిక తల్లి ఈ వార్త నిజమేనని స్పష్టం చేసింది. ‘రష్మిక ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన విషయం నిజమే. దీంతో మేం చాలా డిస్టర్బ్ అయ్యాం. ఆ షాక్ నుంచి రష్మిక ఇప్పుడే కోలుకుంటోంది. ప్రస్తుతం ఆ కుటుంబంతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు...’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక తల్లి సుమన్.
Published by: Ramu Chinthakindhi
First published: September 11, 2018, 9:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading