సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాధచాయలు అలముకున్నాయి. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో కుటుంబసభ్యులు చేర్పించగా నేడు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణ మృతి పట్ల ఎమోషనల్ అయ్యారు.
'సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెల్లడం నమ్మశక్యం కావడం లేదు. మాటలకు అందని విషాదం ఇది. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం, దైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనంల కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహెష్ బాబుకు, ఆయన కుటుంబసభ్యులందరికి, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను' అని మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 15, 2022
ఇక జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కూడా కృష్ణ మృతి పట్ల ఎమోషనల్ ట్వీట్ చేశారు. 'కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. చిత్ర సీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్ధకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతగానో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణ గారు అస్వస్థతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని' వెల్లడించారు.
మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు.
JanaSena Chief Sri @PawanKalyan :
శ్రీ కృష్ణ గారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. (1/5 — JanaSena Party (@JanaSenaParty) November 15, 2022
పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krishna, Megastar Chiranjeevi, Pawan kalyan