Home /News /movies /

ITLU MAREDUMILLI PRAJANEEKAM OFFICIAL TEASER RELEASE SB

Itlu Maredumilly Prajaneekam: అక్కడకు వెళ్తే వెనక్కి తిరిగిరారు.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం..

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ విడుదల

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ విడుదల

    అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇప్పటికే దాదాపు టు మిలియన్ వ్యూస్ సాధించింది. నరేష్ 59వ సినిమాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశల్లో ఉంది. దీనికోసం అడవుల్లోకి వెళ్లి మరీ షూట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఇవాళ గురువారం అల్లరి నరేష్ పుట్టిన రోజు కావడంతో తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

    తాజాగా టీజర్‌ చూస్తే.. మారేడుమిల్లి అనే ఓ ఊరు ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యలో ఆ ఊరి జనం బతుకుతూ ఉంటారు. అయితే ఎన్నికల వేళ అక్కడికి ఓట్లు వేయించడం కోసం అల్లరి నరేష్ పోలింగ్ అధికారిగా తన టీంతో కలిసి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, విలన్ చేసిన కొన్ని పనుల వల్ల అల్లరి నరేష్ ని తప్పుగా భావించి ఆ ఊరి వాళ్ళు, పోలీసులు కొడతారు . ట్రైలర్‌లో మనకు ఇవే చూపించారు.

    టీజర్ మొత్తంలోనే అంతర్లీనంగా కథ చెప్పేశారు. మరోసారి నరేష్ కంటెంట్ సినిమాతో వస్తుండటంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ టీజర్ చూసిన నెటిజన్స్ నరేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోసారి మంచి కంటెట్‌తో నరేష్ సినిమా తీస్తున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని పలువురు నెటిజన్లు పోస్టులు చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని.. నరేష్ మరోసారి సక్సెస్ కావాలని ఆల్ ది బెస్ట్ చెబుతూ విషెస్ చెబుతున్నారు.

    ఇది ఆదివాసీల ఇతివృత్తంతో సాగే చిత్రం. కొన్ని నెలల క్రితం చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' షూటింగ్ పూర్తయిన వెంటనే కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నరేశ్ భావిస్తున్నాడు. ఉంది. మరోవైపు ‘నాంది’ సినిమాతో మంచి సక్సెస్ తోపాటు తన నటనతో ప్రశంసలు అందుకున్న అల్లరి నరేశ్ తన 60వ చిత్రానికి పచ్చజెండా ఊపాడు.


    ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడలకే మరో అవకాశం ఇచ్చాడు. 'కృష్ణార్జున యుద్ధం', 'మజిలీ', 'గాలి సంపత్', 'టక్ జగదీష్' చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. నరేశ్- విజయ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Allari naresh, Tollywood

    తదుపరి వార్తలు