పండగ వేళ రష్మిక మందన్న ఇంట్లో ఐటీ సోదాలు..

టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలుగుతోన్న రష్మిక మందన్నకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు

news18-telugu
Updated: January 16, 2020, 11:25 AM IST
పండగ వేళ రష్మిక మందన్న ఇంట్లో ఐటీ సోదాలు..
రష్మిక మందన్న (Rashmika Mandanna)
  • Share this:
టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలుగుతోన్న రష్మిక మందన్నకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె సొంత రాష్ట్రం కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఇంట్లో సంక్రాంతి వేళ ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు కన్నడలో హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో బోలెడు ఆఫర్లు ఉన్నాయి. నెక్ట్స్ అల్లు అర్జున్ సుకుమార్ సినిమాతో పాటు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో కథానాయికగా నటించే అవకాశం కొట్టేసింది. ఇప్పటి వరకు పర్ఫామెన్స్ ఓరియంటెడ్‌గా నటిస్తూనే గ్లామర్ ఒలకబోయడం రష్మిక మందన్న స్పెషాలిటీ. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఆమె చిలిపి నటనకు అందరు ఫిదా అయ్యారు.
First published: January 16, 2020, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading