ఐటీ తనిఖీలు జరిగింది నిజమే.. కానీ రష్మికపై కాదు.. కొత్త ట్విస్ట్

రష్మిక మందనకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: January 21, 2020, 8:00 AM IST
ఐటీ తనిఖీలు జరిగింది నిజమే.. కానీ రష్మికపై కాదు.. కొత్త ట్విస్ట్
Instagram
  • Share this:
తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందనకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె సొంతూరు కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించి.. రష్మిక నివాసం నుంచి ఐటీ అధికారులు రూ.25 లక్షల విలువజేసే ఆస్తి పత్రాలు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఈ మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను రష్మిక తండ్రి ఐటీ అధికారులకు చూపించలేకపోయారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే  ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపింది రష్మిక ఆదాయంపై కాదని, ఆమె తండ్రి మదన్‌ ఆస్తిపై అని నటి మేనేజర్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు తెలిపారు. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని రష్మిక స్వస్థలం విరాజ్‌పేట్‌లోని నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించి లెక్కతేలని రూ.25 లక్షల సొమ్ము, ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి.. ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వీటి వివరాలు అందించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ విషయంపై రష్మిక మేనేజర్‌ స్పందిస్తూ.. ఐటీ అధికారుల తనిఖీలు పూర్తిగా ఆమె తండ్రి ఆస్తికి సంబంధించిందని తెలిపారు. కాగా రష్మిక తాజాగా మహేష్‌తో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు