తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్. ఆయనకు రెండు నిర్మాణ సంస్థలున్నాయి. ఒకటి పెద్ద సినిమాల కోసమైతే.. మరోటి చిన్న సినిమాల కోసం. గీతా ఆర్ట్స్ 2లో కూడా వచ్చే సినిమాలకు కూడా అల్లు అరవింద్ ఆశీస్సులు ఉంటాయి. కానీ నిర్మాతగా మాత్రం బన్నీ వాస్, ఎస్‌కేఎన్ లాంటి నిర్మాతల పేర్లు పడుతుంటాయి. ఇక ఇప్పుడు గీతగోవిందం లాంటి సంచలన సినిమాను నిర్మించిన తర్వాత బన్నీ వాస్ ఆఫీస్ పై ఐటి దాడులు జరిగాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు కానీ జరిగినట్లు మాత్రం తెలుస్తుంది.
గతేడాది విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరుశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం చిన్న సినిమాగా విడుదలైంది. కానీ పెద్ద సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో ఏకంగా 130 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే వచ్చిన వసూళ్ల కంటే తక్కువ ఆదాయ పన్ను చూపించారనే అనుమానాలు ఇప్పుడు ఐటి అధికారులకు వచ్చినట్లు తెలుస్తుంది. దాంతో బంజారాహిల్స్ లో ఉన్న జీఏ 2 పిక్చర్స్ ఆఫీస్‌కి హైదరాబాద్ ఐటీ యూనిట్-14 వెళ్లి అక్కడ సోదాలు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయం అల్లు అరవింద్ వరకు కూడా వెళ్లింది.
అక్కడ సినిమాలకు సంబంధించిన వివరాలు.. కలెక్షన్ల రికార్డులను ఐటి అధికారులు పరిశీలించినట్లు తెలుస్తుంది. గీత గోవిందం సినిమా కలెక్షన్లు దాదాపు 130 కోట్లు రావడంతో ఐటీ అధికారులు ఈ పన్ను చెల్లింపుల గురించి గుచ్చి గుచ్చి అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది బన్నీ వాస్ పేరు మీదున్నా కూడా గీతా ఆర్ట్స్ 2 అన్నా కూడా అల్లు అరవింద్ ఆజ్ఞతోనే ఇది కూడా నడుస్తుంది. మొత్తానికి ఇప్పుడు అల్లు అరవింద్ ఆఫీసుపై ఐటి దాడుల విషయం మాత్రం చాలా వేగంగా ఇండస్ట్రీ అంతా పాకిపోయింది. మరి దీనిపై ఆయన ఎలాంటి సమాధానం చెప్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu aravind, Geetha govindam, IT raids, Telugu Cinema, Tollywood